pushpa jaibheem
National Best Actor Controversy : తమిళనాడు నుంచి ముంబయి వెళ్లి, పోర్టర్‌గా జీవితం ప్రారంభించి అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగిన ఒకాయన ఉన్నారు. ఆయన పేరు వరదరాజన్ ముదలయార్. ఆయన జీవితం ఆధారంగా దర్శకుడు మణిరత్నం ‘నాయగన్’ అనే తమిళ సినిమా తీశారు. అందులో కమల్‌హాసన్ ప్రధాన పాత్ర పోషించారు. అంతకుముందు ఏడాది ‘స్వాతిముత్యం’లో అమాయకుడి పాత్ర, అంతకు ఇంకా ముందు “సాగరసంగమం”లో డ్యాన్సర్ పాత్ర పోషించిన కమల్‌హాసన్ ఈ డాన్ పాత్ర చేయడానికి ఏమాత్రం సందేహించలేదు. అద్భుతంగా నటించారు. మెపిఁంచారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారం ఆయన్ను అవార్డు వరించింది.