Visakha Constable Case : కానిస్టేబుల్ భర్తను భార్య చంపుతున్న వీడియో ఇదే

పోలీసుల విచారణలో ఈ విస్తుపోయే వీడియో బయటపడింది. శివానీ తెలివితేటలు చూసి పోలీసులే విస్తుపోయారు. అయితే మత్తులో ఉన్న రమేష్ ను బెడ్ పై పడుకోబెట్టిన శివానిముఖంపై దిండుపెట్టి హత్య చేసిన దృశ్యాలు కూడా ఫోన్ లో రికార్డ్ కావడంతో విషయం బయటపడింది.

Written By: NARESH, Updated On : August 5, 2023 9:31 pm
Follow us on

Visakha Constable Case :  ప్రియుడు మోజులో కానిస్టేబుల్ భర్తను చంపిన భార్య కేసులో సంచలన వీడియో బయటకు వచ్చింది. హత్యకు ముందు భర్తతో ప్రేమగా ఉన్నట్లు వీడియో రికార్డ్ చేసిన శివానీ అతడు గుండెపోటుతో మరణించాడని నమ్మించేలా ఓ వీడియో తీసింది.

భర్తను చంపాలనే పకడ్బందీగా మద్యం తెచ్చి.. మటన్ వండి పెట్టింది. తాను మంచిదని భర్తతో ఆ వీడియోలో చెప్పించింది. పోలీసుల విచారణలో ఈ విస్తుపోయే వీడియో బయటపడింది. శివానీ తెలివితేటలు చూసి పోలీసులే విస్తుపోయారు. అయితే మత్తులో ఉన్న రమేష్ ను బెడ్ పై పడుకోబెట్టిన శివానిముఖంపై దిండుపెట్టి హత్య చేసిన దృశ్యాలు కూడా ఫోన్ లో రికార్డ్ కావడంతో విషయం బయటపడింది.

బర్రి రమేష్ కుమార్ అనే కానిస్టేబుల్ విశాఖ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు.భార్య శివ జ్యోతి అలియాస్ శివానితో కలిసి ఎంవిపి కాలనీలో నివాసం ఉంటున్నాడు.ఈనెల ఒకటో తేదీన విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన రమేష్ తెల్లవారేసరికి మృతి చెందుతూ కనిపించాడు.తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు భార్య శివాని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భార్య ప్రవర్తన పై అనుమానం కలగడంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తాము ఎంతో అన్యోన్యంగా గడిపామని భార్య శివాని కొన్ని వీడియోలు చూపించడంతో..అనుమానాలు మరింత బలపడ్డాయి. దీంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అటు పోస్టుమార్టం నివేదికలో సైతం ఊపిరాడక మృతి చెందినట్లు తేలింది. దీంతో పోలీసులు తమదైన విచారణ చేపట్టడంతో వాస్తవాలు వెల్లడయ్యాయి.

భార్య శివాని ప్రియుడు రామారావు తో కలిసి రమేష్ ను మట్టు పెట్టినట్లు పోలీస్ విచారణలో తేలింది.ఎదురింట్లో నివాసముండే రామారావుతో శివాని ఏడాదిన్నరగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో తరచూ దంపతుల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. రామారావు,శివానీలు కొద్దిరోజులు పాటు బయటకు వెళ్ళిపోయారు. ఇరు కుటుంబ సభ్యులు నచ్చజెప్పి శివానిని ఇంటికి తీసుకొచ్చారు. అయినా సరే శివాని వ్యవహార శైలిలో మార్పు రాలేదు. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలుస్తున్న భర్త రమేష్ ను అంతమొందించాలని శివాని ప్లాన్ చేసింది. తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలు విక్రయించి అప్పుఘర్లో వెల్డింగ్ పనులు చేసే నీలా అనే వ్యక్తికి సుపారీ అప్పగించారు.

ఆరోజు రాత్రి డ్యూటీ నుండి వచ్చిన రమేష్ భోజనం చేసి నిద్రపోయాడు. అప్పటికే ముందస్తు ప్రణాళిక ప్రకారం నీలా అక్కడకు చేరుకున్నాడు. రమేష్ ముఖంపై నీలా దిండు పెట్టి గట్టిగా అదిమి పట్టుకోగా.. శివాని కదలకుండా కాళ్లు పట్టుకుంది. రామారావు ఇంటి బయట ఉండి ఎవరూ రాకుండా కాపలాకాశాడు. ప్రాణాలు పోయిన తర్వాత శివాని గుండెపోటు కట్టుకథను అల్లింది. ప్రస్తుతం నిందితులందరూ పోలీసుల అదుపులో ఉన్నారు.తండ్రి మృతి.. తల్లి జైలు పాలు కావడంతో పిల్లలిద్దరూ అనాధలుగా మిగిలారు. వారిని పోలీస్ శాఖ సంరక్షిస్తుందని సిపి త్రివిక్రమ్ వర్మ తెలిపారు.