BRS Dharani : బీఆర్‌ఎస్‌ ‘ధరణి’పై సీఎం రేవంత్‌ తొలి అస్త్రం

ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయని, వీటి పరిష్కారానికి మండల స్థాయి గ్రీవిన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Written By: NARESH, Updated On : December 14, 2023 10:09 am
Follow us on

BRS Dharani : ధరణి.. తెలంగాణలో భూముల పరిరక్షణకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మూడేళ్ల కింద ఈ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ పోర్టల్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు ధరణి అడ్డాగా మారిందని బీజేపీ, కాంగ్రెస్‌ ఆరోపించాయి. అయితే బీఆర్‌ఎస్‌ వాటిని తిప్పికొట్టింది. ధరణిని పుట్టించిందే తానని కేసీఆర్‌ గొప్పలు చెప్పుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్‌ ధరణితో లక్ష ఎకరాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని మేనిఫెస్టోల్లో పేర్కొన్నారు. కేసీఆర్‌ మాటలను విశ్వసించని జనం కాంగ్రెస్‌ను గెలిపించారు.

ధరణిపై సీఎం సీమీక్ష..
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ధరణి పోర్టల్‌పై సచివాలయంలో బుధవారం(డిసెంబర్‌ 13న) సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, సంబంధిత అధికారులు హాజరయ్యారు. సమావేశంలో సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌∙మిట్టల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. సమీక్ష అనంతరం నిషేధిత జాబితా, అసై¯Œ భూములు, పట్టా భూములు తదితర అంశాలతోపాటు సమావేశంలో మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్‌ మిట్టల్‌ను సీఎం ఆదేశించారు.

లోపాలే అస్త్రంగా..
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, భూయాజమాన్య వివరాలు సులభంగా తెలుసుకునేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్‌ పోర్టల్పై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ పోర్టల్లో చాలా లొసుగులు ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అధికారంలోకి రాగానే ధరణిని ప్రక్షాళన చేస్తామని గతంలో ప్రకటించారు. దరణి పోర్టల్లో మార్పులు చేసి దాని పేరును ’భూమాత’గా మారుస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి ధరణి పోర్టౖల్‌పై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దాదాపు 2 గంటలపాటు సమీక్షించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో ధరణి యాప్‌ భధ్రతపై సీఎం ఆరా తీశారు.

మండలస్థాయిలో గ్రీవెన్స్‌..
ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయని, వీటి పరిష్కారానికి మండల స్థాయి గ్రీవిన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలపై వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్‌పై నివేదిక ఇవ్వాలని కోరారు.

కేంద్రం నిధులు ఏమయ్యాయి..
భూములు సర్వే చేయాలని, డిజిటలైజేషన్‌ చేయాలని, ఆన్‌లైన విధానం తీసుకురావాలని టైటిల్‌ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్రం ఇచ్చిన రూ.83 కోట్లు నిధులు ఏమయ్యాయని అధికారులను సీఎం నిలదీశారు. నిషేధిత జాబితా, అసైన్డ్‌ భూములు, పట్టా భూములు తదితర అంశాలతో పాటు మంత్రులు అడిగిన, లేవనెత్తిన అన్నిఅంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నవీ¯Œ మిట్టల్‌కు ముఖ్యమంత్రి ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్‌ కోసం గత ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్, సమస్యలకు నిలయంగా మారిందని రేవంత్‌రెడ్డి అన్నట్లు సమాచారం. ధరణిపై మరోసారి ఉన్నతాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

ఇప్పటికే విద్యుత్‌ బకాయిలు, రేషన్‌ బియ్యం బకాయిలతోపాటు బీఆర్‌ఎస్‌ 9 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీసేందకు కాంగ్రెస్‌ సర్కార్‌ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాంగా అన్ని శాఖలపై శ్వేతపత్రాలు సిద్ధం చేస్తోంది. వీటినే రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌పై అస్త్రాలుగా సందించే అవకాశం ఉంది.