CM Jagan vs Rebels : జగన్ పిచ్చ క్లారిటీతో ఉన్నాడు. కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.. తనను ఏపీలో కొట్టే మగాడే లేడని అనుకుంటున్నాడు. ఇది కాన్ఫిడెంట్సా లేక ఓవర్ కాన్ఫిడెంట్సా అన్నది వచ్చే ఎన్నికల్లో తేలనుంది. అయితే తన వద్దకు వచ్చే అసమ్మతి ఎమ్మెల్యేలకు మాత్రం గట్టి వార్నింగ్ లే ఇస్తున్నాడట.. మీ వల్ల నేను గెలవలేదని.. నా వల్లే మీరు గెలిచారంటూ స్పష్టం చేస్తున్నాడట.. స్వయంగా ఈ మధ్య కలిసిన ఎమ్మెల్యేలతో జగన్ మాట్లాడిన బూతు మాట ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రత్యర్థి కర్రి శీను ఈ విషయాన్ని బయటపెట్టడం వైరల్ గా మారింది.
చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొట్టిన దెబ్బకు జగన్ షాక్ అవుతున్నారు.. తన మీడియా, అర్థ, అంగ బలాలతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకొని ఎంతగా ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేస్తాడో తెలిసిందే. అంత దాకా ఎందుకు.. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకే షాకిస్తూ ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలను కొని టీడీపీ ఎమ్మెల్సీని గెలిపించుకున్నాడు.. అలాంటి చంద్రబాబు 2024కు ముందే వైసీపీ ఎమ్మెల్యేలను భారీగా కొని జగన్ ను దెబ్బతీయాలని చూస్తున్నాడని వైసీపీ భయపడుతోంది.
ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణ సహా చాలా మంది వైసీపీలోనే ఉంటూ జగన్ కు వ్యతిరేకంగా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలందరినీ జగన్ బయటకు తీస్తున్నారు. ఒక్కొక్కరు ఎవరు చంద్రబాబుతో లాలూచీ పడ్డారో అన్నింటిని నిఘాతో వెలికితీస్తున్నారు. నెల్లూరులో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలానే చంద్రబాబుతో అంతర్గతంగా మాట్లాడుతూ జగన్ కు చిక్కాడు. వైసీపీలో ఉంటే తనకు టికెట్ దక్కదని.. తాను చేసిన ఎదవ పనులకు జగన్ ఇవ్వడని గ్రహించి ముందే టీడీపీలో ఖర్చీఫ్ వేసేశాడు. అలాంటి గొర్రెలను ఏరిపారేసేందుకు జగన్ రెడీ అయ్యారు.
ఇటీవల చంద్రబాబుతో లాలూచీ పడిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేల జాబితా జగన్ వద్దకు వచ్చిందట.. ఈ క్రమంలోనే వారు తాజాగా కలిసి తాము చంద్రబాబుతో లాలూచీ పడలేదని జగన్ ముందర బుకాయించారట.. కానీ ఆ ఆధారాలన్నీ ముందర పెట్టి.. ‘నాకు ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టినా 158 సీట్లు వస్తాయి.. మీరు ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లి చంద్రబాబు సంకనాకండి’ అని జగన్ అన్నాడని అమరావతికి చెందిన టీడీపీ సానుభూత నేత కర్రి శ్రీను బయటపెట్టాడు. టీడీపీ అనుకూల చానెల్ అయిన ఏబీఎన్ లోనే ఈ మాట అనడంతో ఇది నిజంగానే నిజం అని అర్థమైంది.
ఇలా చంద్రబాబుకు అనుకూలంగా వైసీపీలో ఉన్న గొర్రెలను జగన్ ఏరివేస్తున్నాడు. ముక్కుసూటిగా చెప్పాడు. ‘వై నాట్ 175’ అన్న జగన్ ధీమా వెనుక ప్రజాబలం ఉందని తెలుస్తోంది. అందుకే బాగా పనిచేయని.. ప్రజల మద్దతు లేకుండా చంద్రబాబు కోవర్టులుగా పనిచేసే వారు అవసరం లేదంటూ జగన్ కుండబద్దలు కొడుతున్నాడు. ఉంటే ఉండండి.. లేదంటే లేదు అంటూ స్పష్టం చేస్తున్నాడు.