Naveen Polishetty: టాలీవుడ్ లోకి లేటెస్ట్ గా అడుగుపెట్టిన యావ హీరోలలో యూత్ లో మంచి క్రేజ్.. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు నవీన్ పోలిశెట్టి.. తొలి సినిమా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తోనే ఎవరీ కుర్రాడు ఇంత అద్భుతంగా నటిస్తున్నాడు అని పేరు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి.. ఆ తర్వాత జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్నాడు.. ఈ చిత్రం సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ మార్కుని సాధించి నవీన్ పోలిశెట్టి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా, అతనిని ఓవర్ నైట్ క్రేజీ స్టార్ గా మార్చేసింది ఈ చిత్రం..అయితే నవీన్ పోలిశెట్టి ఇంత దూరం రావడానికి ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుగులను ఎదురుకున్నాడు..అతను సినీ ఇండస్ట్రీ కి వచ్చే వరకు చేసిన ప్రయాణాన్ని ఇప్పుడు మేము మీ ముందు ఉంచబోతున్నాము.

-బాల్యం/వ్యక్తిగతం :
నవీన్ పోలిశెట్టి 1989వ సంవత్సరం డిసెంబర్ 26వ తేదీన జన్మించాడు..అతని తండ్రికి ఒక మెడికల్ షాప్ ఉంది.. తల్లి ఒక బ్యాంకు ఉద్యోగి..నవీన్ పోలిశెట్టి కి ఒక అన్నయ్య – ఒక అక్క ఉన్నారు..వీళ్లిద్దరు కూడా అమెరికా లో బాగా స్థిరపడ్డారు..నవీన్ పోలిశెట్టి సివిల్ ఇంజనీర్ గా ‘మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ లో బీటెక్ పట్టా పొందాడు..ఆ తర్వాత ఆయనకీ పూణే లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది..ఆ తర్వాత ఆన్ సైట్ ద్వారా ఇంగ్లాండ్ కి వెళ్లి అక్కడ ఇంజనీర్ గా కొన్ని రోజులు పనిచేసాడు..కానీ అతనికి చిన్నప్పటి నుండి సినిమాలు అంటే పిచ్చి.. సినిమా యాక్టర్ అవ్వాలనే పిచ్చితోనే ఉన్నాడు..కానీ ఇంట్లో వాళ్లకి అది ఇష్టం లేదు..అందుకే సివిల్ ఇంజనీర్ వరకు చదివి ఉద్యోగం చేసి మధ్యలో వదిలేసాడు..ఇంట్లో చెప్పకుండా ముంబై వచ్చేసి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టాడు.
-లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో వెండితెర అరంగేట్రం:
ఇక అప్పుడే శేఖర్ కమ్ముల తాను తీయబోతున్న లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా కోసం ఆడిషన్స్ నిర్వహిస్తున్నాడు..ఈ ఆడిషన్స్ లో విజయ్ దేవరకొండతో పాటుగా నవీన్ పోలిశెట్టి కూడా పాల్గొన్నాడు..ఇద్దరు ఒక్కేసారి సెలెక్ట్ అయ్యారు కూడా.. అలా వెండితెర అరంగేట్రం చేసిన నవీన్ కి ఆ చిత్రం పెద్దగా గుర్తింపు ఏమి తెచ్చిపెట్టలేదు.. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘1 నేనొక్కడినే’ సినిమాలో ఒక చిన్న పాత్ర పోషించాడు.. అయినా కూడా పెద్దగా నోటీసు అవ్వలేదు.
-నవీన్ జీవితాన్ని మార్చేసిన యూట్యూబ్ :
ఇక ఆ తర్వాత హిందీ లో పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇండియా బక్ చోడ్ తో టై అప్ అయిన నవీన్ ఎన్నో యూట్యూబ్ స్కిట్స్ చేసాడు.. వాటిల్లో ‘యావరేజ్ గయ్’ అనే స్కిట్ యూట్యూబ్ లో గ్రాండ్ హిట్ అయ్యింది. నవీన్ పోలిశెట్టి కి నేషనల్ వైడ్ పాపులారిటీ వచ్చింది.. ఎవరీ కుర్రాడు ఇంత హుషారుగా ఉన్నాడు అని అందరి దృష్టిలో పడ్డాడు.. ఆ తర్వాత మళ్ళీ టాలీవుడ్ కి వచ్చాడు..ఈసారి తానే సొంతంగా స్క్రిప్ట్ రాసుకొని ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ అనే చిత్రం చేసాడు.. సూపర్ హిట్ అయ్యింది..ఆ తర్వాత ఆయనకీ బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి ‘చిచోరే’ అనే సినిమా చేసాడు.. ఇందులో అద్భుతమైన నటన కనబర్చాడు..ఈ చిత్రం అక్కడ పెద్ద హిట్.

ఇక ఆ తర్వాత జాతిరత్నాలు అనే సినిమా చేసాడు..ఈ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.. ఈ చిత్రం తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు..టాలీవుడ్ అగ్ర నిర్మాతలు.. దర్శకులు నవీన్ తో సినిమాలు చేయడానికి క్యూ కట్టేసారు..ప్రస్తుతం యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు.. ఈ చిత్రం లో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.. ఈ సినిమాతో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘అనగనగ ఒక రాజు’ అనే సినిమా చేస్తున్నాడు. ఇలా యూట్యూబ్ లో స్కిట్ ల నుంచి ఏకంగా స్టార్ హీరోగా ఎదిగే వరకూ నవీన్ ప్రస్థానం సాగింది.