బ్రేకింగ్: నేను పార్టీ పెట్టడం అన్నయ్య జగన్ కు ఇష్టం లేదు: షర్మిల సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయిన వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబంలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని పరోక్షంగా అంగీకరించారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టడం అన్నయ్య, ఏపీ సీఎం జగన్ కు ఇష్టం లేదని బాంబు పేల్చారు. ఈరోజు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల విద్యార్థులతో సమావేశమయ్యారు. తాను పెట్టే పార్టీపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. లోతుపాతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా విలేకరులతో చిట్ […]

Written By: NARESH, Updated On : February 24, 2021 7:50 pm
Follow us on

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టడానికి రెడీ అయిన వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ కుటుంబంలో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని పరోక్షంగా అంగీకరించారు. తాను తెలంగాణలో పార్టీ పెట్టడం అన్నయ్య, ఏపీ సీఎం జగన్ కు ఇష్టం లేదని బాంబు పేల్చారు.

ఈరోజు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల విద్యార్థులతో సమావేశమయ్యారు. తాను పెట్టే పార్టీపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. లోతుపాతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా విలేకరులతో చిట్ చాట్ లో ఈ విషయం బయటపెట్టాడు.

తాను తెలంగాణలో పార్టీ పెట్టడం అన్నయ్య, ఏపీ సీఎం జగన్ కు ఇష్టం లేదని.. ఏపీలో అఖండ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చినా తనకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ నే అడగాలని మీడియా మిత్రులకు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు.

ఇక తాను తెలంగాణలో పార్టీ పెడితే ఆంధ్రా నేత అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని.. తాను తెలంగాణ కోడలినని వైఎస్ షర్మిల కుండబద్దలు కొట్టారు. తన స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికి లేదని.. కేసీఆర్, విజయశాంతి ఎక్కడి వారని షర్మిల ప్రశ్నించారు. అమరీవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి గడపకు వెళ్తానని షర్మిల స్పష్టం చేశారు.

ఇక తాను తెలంగాణలో పెట్టిన పార్టీ అన్నయ్య జగన్ కు ఇష్టం లేకున్నా.. తన తల్లి విజయలక్ష్మి మద్దతు మాత్రం తనకు ఉందని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

మొత్తంగా షర్మిల అన్నయ్య జగన్ తో విభేదించే బయటకు వచ్చారన్న విషయం ఈరోజుతో క్లారిటీ వచ్చేసింది. ఆమెకు, జగన్ కు విభేదాలు ఉన్నాయన్న విషయం కూడా తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలతో బయటపడింది.