Chandrababu Naidu on Janasena ఒకవైపు జనసేనతో స్నేహంగా ఉంటూనే రెండోవైపు వెన్నుపోటు పొడుస్తున్నారా? అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తు దిశగా టీడీపీ, జనసేన మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతిలో రాధాక్రిష్ణ రాసిన కథనంతో పవన్ మనస్తాపానికి గురయ్యారు. పవన్ తనతో కలిసి కానీ.. ఒంటరి పోరాటం కానీ చేస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూ.1000 కోట్లు లంచం ఆఫర్ చేశారన్నదే ఈ కథనం సారాంశం. ఏపీలో ఇప్పటికే పవన్ సోదరుడు చిరంజీవి రాజకీయంగా ఫెయిలయ్యారని.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు సొంతంగా ఎన్నికల్లో గెలిచే సామర్థ్యం లేదని కూడా కథనం సూచించింది. అక్కడితో ఆగకుండా వద్దని ఓ కాపు సంఘం నేత వారించిన విషయాన్ని కూడా ఆర్కే ప్రస్తావించారు.
అయితే దీనిపై పవన్ ఇంతవరకూ స్పందించలేదు. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం రియాక్టయ్యారు. ఇటువంటి దిగజారుడు కథనాలతో మీకే నష్టమని చంద్రబాబుకు గట్టి సంకేతాలే పంపారు. అక్కడ నుంచి చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా పవన్ పెద్దగా ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఇద్దరి నేతల మధ్య మాటలు బంద్ అయినట్టు సమాచారం.రాధాక్రిష్ణ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంతటి పరిస్థితికైనా దిగజారుతారని అందరికీ తెలిసిందే, అయితే ఈ కథనం వెనుక చంద్రబాబు ఉన్నట్టు జన సైనికులు నమ్ముతున్నారు. అందుకే చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలని పవన్ కు సూచిస్తున్నారు.
ఈ క్రమంలోనే జనసేనతో స్నేహం, రెండోవైపు వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.