సైనికుల కోసం మోడీ సాహసం

చైనా పన్నిన కుట్రలతో లద్దాఖ్‌ అంటే తెలియని భారతీయులు లేరు. అక్కడి పరిస్థితులు.. అక్కడి వాతావరణం గురించి తెలియని వారుండరు. దేశమంతా మండు వేసవి నడుస్తుంటే.. అక్కడ మాత్రం ఎముకలు కొరికే చలి కనిపిస్తుంటుంది. ఇక శీతాకాలంలో ఆ వాతావరణాన్ని తలచుకుంటేనే భయం వేస్తుంటుంది. ఊహించని స్థాయిలో మైనస్‌ డిగ్రీలకు చేరుకుంటుంది. అక్టోబరు నుంచి జనవరి వరకు పరిస్థితి అంచనా కూడా వేయలేం. ఇక రాత్రివేళల్లో అయితే పెనువేగంతో శీతల గాలులు వీస్తుంటాయి. మనిషిని నిలువునా గడ్డ […]

Written By: Srinivas, Updated On : December 4, 2020 10:38 am
Follow us on


చైనా పన్నిన కుట్రలతో లద్దాఖ్‌ అంటే తెలియని భారతీయులు లేరు. అక్కడి పరిస్థితులు.. అక్కడి వాతావరణం గురించి తెలియని వారుండరు. దేశమంతా మండు వేసవి నడుస్తుంటే.. అక్కడ మాత్రం ఎముకలు కొరికే చలి కనిపిస్తుంటుంది. ఇక శీతాకాలంలో ఆ వాతావరణాన్ని తలచుకుంటేనే భయం వేస్తుంటుంది. ఊహించని స్థాయిలో మైనస్‌ డిగ్రీలకు చేరుకుంటుంది. అక్టోబరు నుంచి జనవరి వరకు పరిస్థితి అంచనా కూడా వేయలేం. ఇక రాత్రివేళల్లో అయితే పెనువేగంతో శీతల గాలులు వీస్తుంటాయి. మనిషిని నిలువునా గడ్డ కట్టించేస్తాయి.

Also Read: ఆ తప్పిదం చేయకుండా మమత అలర్ట్‌ అయ్యారట

పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోని ఈ ప్రాంతంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నెలకొంటుంది. శీతాకాలంలో ఇక్కడ విధి నిర్వహణ సైనికులకు కత్తిమీద సాములాంటిదే. అయినప్పటికీ అనుక్షణం భారత బలగాలు సరిహద్దులను కంటికిరెప్పలా కాపాడుతుంటాయి. తూర్పు లడ్డాఖ్‌లో ఆరు నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇక్కడ భారత బలగాల మోహరింపు ఎక్కువగా ఉంది. దాదాపు 50 వేల మంది సైనికులు పహారా కాస్తుంటారని అంచనా. ఈ చలికాలంలో వీరందరికీ తగిన వసతులు కల్పించడం క్లిష్టతరమే. అయినప్పటికీ భారత ప్రభుత్వం దీనిని ఒక సవాల్‌గా తీసుకుని ముందుకు సాగింది.

టీ 90, టీ 72 ట్యాంకులు, శతఘ్నులు, పదాతిదళ పోరాట శకటాలను సరిహద్దుల్లోని చుషుల్, దెమ్ చౌక్ ప్రాంతాలకు తరలించింది. సైన్యం ధరించే శీతాకాల దుస్తులు, గుడారాలు, వేల టన్నుల ఆహార పదార్థాలు, ఇంధనం, కమ్యునికేషన్ సాధనాలు, విద్యుత్ హీటర్లను పంపింది. ఈ ట్యాంకులు అతి శీతల వాతావరణంలోనూ సమర్థంగా పని చేయగలవు. స్వాతంత్ర్యం అనంతరం భారత సైన్యం చేపట్టిన అతి పెద్ద ఆపరేషన్ ఇదేనని మాజీ సీనియర్ సైనికాధికారులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి కఠోర వాతావరణంలో సాయుధ శకటాలను మోహరించిన ఏకైక దేశం భారత్ కావడం గమనార్హం.

Also Read: మెగాస్టార్‌‌ రాజకీయాల్లో ఉంటే సీఎం అయ్యేవారు: పవన్ సంచలనం

అయితే.. సైనికులు ధరించే శీతల దుస్తులను ఐరోపా దేశాల నుంచి భారత్‌ దిగుమతి చేసుకుంది. తీవ్ర చలిగాలులను తట్టుకునేందుకు సరికొత్త ఆవాసాలు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలను భారత సేన యుద్ధ ప్రాతిపదికన నిర్మించింది. వీటికి పెద్దగా సిమెంటు, ఇసుక అవసరం కూడా లేదు. వీటిని వేగంగా వినియోగానికి రెడీ చేయొచ్చు. బలమైన గాలులు, చలి నుంచి రక్షించేందుకు ఈ ఆవాసాల్లో ఇన్సులేషన్ ఉంటుంది. హీటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. వంటగది, మరుగుదొడ్లు వంటివి ఇందులో ఉంటాయి. ఇందుకోసం అధునాతన సాంకేతికతను వినియోగించారు.

శీతాకాలాన్ని ఎదుర్కొనే ప్రత్యేక దుస్తుల సరఫరా కారణంగా సైనికుల పోరాట సన్నద్ధత పటిష్టంగా ఉంటుంది. నదులు దాటడం, అడ్డంకులను అధిగమించడంలో భారత సైనికులు పట్టుదలతో పనిచేస్తారు. ఇలాంటి కఠోర పరిస్థితుల్లోనూ పనిచేసే దళాలకు కాస్తంత ఆటవిడుపు కోసం టీవీలు, సెట్ టాప్ బాక్సులను ఏర్పాటు చేశారు. సైనికులకు అధిక కేలరీలు గల పోషకాహారాన్ని అందిస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని సైన్యాధిపతి జనరల్ ముకుంద్ మనోజ్ నరవణె దగ్గరుండి పర్యవేక్షించారు. సైనికులకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకూడదన్న లక్ష్యంతో ఆయన పనిచేశారు. భారత సైన్యం కూడా సౌకర్యాల విషయాన్ని పక్కనబెట్టి దేశ రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. అదే సమయంలో సైనికులకు అవసరమైన ఆయుధాలు, ఆహార పదార్థాలు సమకూర్చేందుకు ఎంత ఖర్చు పెట్టేందుకు అయినా భారత ప్రభుత్వం వెనకాడటం లేదు. దీంతో మనసైన్యం మరింత ఉత్సాహంగా, రెట్టించిన పట్టుదలతో పనిచేస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్