CAG Report : ఒకనాడు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై మాట్లాడితే వైసీపీ నేతలు ఇతరులు పెద్దగా విరుచుకుపడ్డారు. ఆరోజు పవన్ ఏం చెప్పారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఎన్నికైన పంచాయితీలకు సమాంతర వ్యవస్థ. మన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. సంఘ విద్రోహ సంస్థలకు చేరవేస్తున్నారు. ప్రైవేటు సంస్థలకు ఇస్తున్నారు. 5వేల గౌరవ వేతనంతో వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.
దీనిపై వైసీపీ రెచ్చిపోయింది. కొంతమంది వాలంటీర్లను రోడ్లపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ పై అటాచ్ చేయించింది. దీనికి పవన్ కళ్యాణ్ ఏం వెరవలేదు. ఆరోజు ప్రజల ముందు జగన్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టారు.
నిన్నటికి నిన్న అసెంబ్లీ సాక్షిగా కాగ్ నివేదికను ప్రవేశపెట్టారు. ఇది ఎక్కడో కాదు ఆంధ్ర అసెంబ్లీలోనే ప్రవేశపెట్టారు. ఆరోజు పవన్ ఏం మాట్లాడాడో అదే ఈరోజు రిపోర్ట్ లో పొందుపరిచారు. ప్రభుత్వమే ప్రవేశపెట్టిన నివేదిక ఇదీ.. కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో వైసీపీ సర్కార్ బండారం బయటపెట్టింది. కాగ్ నివేదిక ప్రకారం.. ఈ వలంటీర్ వ్యవస్థ 72వ రాజ్యాంగ సవరణకే వ్యతిరేకంగా ఉందని.. వలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభుత్వ వ్యవస్థలే నాశనం అవుతున్నాయని.. ఎన్నికైన ప్రజాప్రతినిధులనే పక్కనపెట్టి వార్డు కమిటీలను ఆపాయం చేయకుండా ఏ విధంగా వార్డు సంస్థలను ఎస్టాబ్లిష్ చేస్తారని ప్రశ్నించింది. పవన్ మాట్లాడిందే సీఐడీ నివేదిక వెలిబుచ్చింది.
గ్రామ సచివాలయ వ్యవస్థపై జగన్ ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టిన CAG నివేదికపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.