CAA : పార్లమెంట్ ఎన్నికల ముంగిట కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ.. పార్లమెంటులో ఆందోళనలు చేసినప్పటికీ వెనుకంజ వేయని కేంద్ర ప్రభుత్వం.. దానిని బలవంతంగా ఆమోదించింది. ఇప్పుడు దాని అమలుకు ప్రకటన విడుదల చేసింది. ఇంతకీ ఏమిటది? దానిపై కేంద్రం ఎందుకు అంత ఆసక్తిగా ఉంది? దానిని ప్రతిపక్షాలు ఎందుకు వద్దంటున్నాయి?
సి ఏ ఏ స్థూలంగా చెప్పాలంటే పౌరసత్వ సవరణ చట్టం.. దీనిని కేంద్ర ప్రభుత్వం 2019లో రూపొందించింది. దీని అమలుకు నడుం బిగిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయి. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి అడ్డు చెప్పారు. నిండు శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అప్పట్లో ఎన్నికలు ఉండటం.. పైగా దీనిపై రకరకాల వాదనలు తెరపైకి రావడంతో.. కేంద్రం దీనిని నిలుపుదల చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా పార్లమెంట్లో బలవంతంగా ఆమోదింపచేసుకుంది. దీనిని రాష్ట్రపతి కూడా ఆమోదించారు. చట్టానికి ఓకే చెప్పారు. చట్టమైనప్పటికీ పూర్తి నిబంధనలపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదని ప్రతిపక్షాలు సరికొత్త వాదనను లేవనెత్తాయి. దీంతో సిఏఏ చట్టం అమలుకు నోచుకోలేదు. అయితే ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో త్వరలో సీఏఏ చట్టాన్ని అమలులోకి తీసుకొస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదే పదే ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన విధంగానే సోమవారం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
సిఏఏ అమల్లోకి వస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద ఎటువంటి ధ్రువ పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం లభిస్తుంది.. 2014 డిసెంబర్ 31 గంట ముందు ఆ దేశాల నుంచి భారత్ కు వచ్చిన క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్టీలకు భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే ఈ ప్రక్రియను కేంద్రం మొత్తం అన్ లైన్ విధానంలోనే చేపడుతుంది. అయితే దీనికి సంబంధించి కేంద్రం ఎటువంటి నిబంధనలు తెరపైకి తీసుకువచ్చిందనేది ఇంకా తెలియ రాలేదు. కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంతో సిఏఏ అమల్లోకి వచ్చినట్టైంది. అయితే దీనిపై ప్రతిపక్షాలు రకరకాలుగా స్పందిస్తున్నాయి. కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేసి కేంద్రం ఈ చట్టం తీసుకొచ్చిందని, ఇది సరైనది కాదని ఆరోపిస్తున్నాయి. ఎవరెన్ని విమర్శలు చేసినా సీఏఏ పై వెనకడుగు వేసేది లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Caa act central notification for caa what will happen if it is implemented
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com