Telugu Indian Idol Mega Finale: పాటల పూదోటలో ‘వాగ్దేవి’ విరిసింది. తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచింది. ఓకేతెలుగు.కామ్ ముందే చెప్పినట్టుగానే అందరి అంచనాలు అందుకుంటూ ఇండియన్ ఐడల్ తెలుగు తొలి సీజన్ విజేతగా సింగర్ బీవీకే. వాగ్దేవి ఆవిర్భవించింది. దాదాపు 15 వారాల పాటు సుధీర్ఘంగా సాగిన ఈ పాటల సమరం చివరకు మహిళా విజేతతో ముగించింది. ఎవరు అవుతారన్న ఉత్కంఠ వీడింది.

మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా వాగ్దేవి మొదటి తెలుగు ఐడల్ ట్రోఫీని అందుకోవడం విశేషం. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘ఆహా’లో ఈ శుక్రవారం ఫైనల్ ప్రసారమైంది. మెగాస్టార్ తోపాటు రానా, సాయిపల్లవి హాజరై ఫైనల్స్ ను మరింత ఫేవరేట్ గా మార్చేశారు.
తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా నిలిచిన వాగ్దేవికి రూ.10 లక్షల బహుమతి లభించింది. చిరంజీవి మరో రూ.6లక్షలు అదనంగా ఇవ్వడం విశేషం. అంతేకాదు.. చిరంజీవి తన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో పాడే అవకాశం కూడా ఇస్తానని హామీఇచ్చింది. మొదటి రన్నరప్ శ్రీనివాస్ కు రూ.3 లక్షలు , రెండో రన్నరప్ వైష్ణవికి రూ.2 లక్షల బహుమతి లభించింది.

ఇక తెలుగు ఐడల్ తొలి విజేతకు ప్రైజ్ మనీ వర్షం కురిసింది. వాగ్దేవికి తెనాలి డబుల్ హార్స్ రూ.3 లక్షలు, చందనాబ్రదర్స్ రూ.3 లక్షలు బహూకరించారు. ఇక రన్నరప్ శ్రీనివాస్ కు సైతం తెనాలి డబుల్ హార్స్ రూ.2 లక్షలు బహూకరించారు. మరో రన్నరప్ చందనా బద్రర్స్ రూ.1 లక్షల బహుమతిగా అందించారు.
హిందీలో ‘సోనీ’ టీవీలో ప్రసారమయ్యే ఈ షోను తెలుగులో ‘ఆహా’ ఓటీటీ ‘తెలుగు ఇండియన్ ఐడల్’గా మార్చి నిర్వహించింది. యాంకర్ గా శ్రీరామచంద్ర, జడ్జీలుగా తమన్, నిత్యమీనన్, కార్తీక్ ఈ షోలు ముందుకు నడిపించారు.
విజేతగా నిలిచిన వాగ్దేవి ఎమోషనల్ అయ్యింది. ‘చిరంజీవి లాంటి పెద్దల చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడం ఆనందంగా ఉంది’ అని మురిసిపోయింది. ఎన్నో జ్ఞాపకాలు, జ్ఞానాన్ని తీసుకువెళుతున్నానని పేర్కొంది. అవకాశాన్ని ఇచ్చిన తెలుగు ఇండియన్ ఐడల్ , ‘ఆహా’కు కృతజ్ఞతలు తెలిపింది.
ఇప్పటికే వాగ్దేవి పాటకు అప్పట్లో వచ్చిన అగ్రహీరో బాలయ్య ఫిదా అయిపోయాడు. జూనియర్ పూజా హెగ్డే అంటూ కితాబిచ్చాడు. ఆ పేరు ఆమెకు బాగా క్రేజ్ తీసుకొచ్చింది. బాలయ్య ఊహించినట్టే వాగ్దేవినే ఇండియన్ ఐడల్ విజేతగా నిలవడం విశేషం.
నెల్లూరు జిల్లాకు చెందిన వాగ్దేవి ఒడిషాలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చదువుతోంది. చదువు కొనసాగిస్తూనే సింగర్ గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. ఆ పాటలపై ఇష్టంతోనే తెలుగు ఇండియన్ ఐడల్ లో పాల్గొని ఏకంగా విజేతగా నిలిచింది.
[…] […]