Budget 2024: నేడు కేంద్ర బడ్జెట్.. ఈ కీలక విషయాలు మీకు తెలుసా?

Budget 2024 ఇందిరా గాంధీ 1970_71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ ఈ ఘనత సాధించిన రెండవ మహిళగా నిలిచారు. అరుణ్ జెట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యారు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 1, 2024 11:53 am

Budget 2024

Follow us on

Budget 2024: మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 2024_25 సంవత్సరానికి సంబంధించి మూడు నెలల కాలానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం ఆమె పార్లమెంట్లో ప్రసంగిస్తున్నారు.. ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆమె పార్లమెంట్ లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. డిజిటల్ నేపథ్యంలో ఒక ట్యాబ్, కొన్ని పత్రాలు మాత్రమే ఆమె ఆర్థిక శాఖ కార్యాలయానికి తీసుకెళ్లారు. బడ్జెట్ కేటాయింపులను యాప్ ద్వారా గౌరవ పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు స్మార్ట్ ఫోన్ లో చూడవచ్చు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో.. అంతకుముందు దేశంలో కొన్ని కీలక మార్పులు జరిగాయి. యూనియన్ బడ్జెట్ కు కొన్ని గంటల ముందు మార్కెటింగ్ కంపెనీలో వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను పెంచాయి. ఇక మోడీ ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని భారతీయ వ్యాపారవేత్తలు ఆశిస్తున్నారని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ప్రకటించారు.

ఇక ఇందిరా గాంధీ 1970_71 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ సమర్పించారు. ఆ తర్వాత 2019లో నిర్మలా సీతారామన్ ఈ ఘనత సాధించిన రెండవ మహిళగా నిలిచారు. అరుణ్ జెట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడు ఆయన చూస్తున్న ఆ మంత్రిత్వ శాఖను పీయూష్ గోయల్ కు అప్పగించారు. పీయూష్ 2019లో చివరి మధ్యంతర బడ్జెట్ సమర్పించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం అనంతరం కేంద్ర బడ్జెట్ పత్రాలు అధికారిక వెబ్ సైట్, మొబైల్ యాప్ లలో అందుబాటులో ఉంటాయి.. ఇక 1991లో పార్లమెంటుకు ఆర్థిక పత్రాన్ని సమర్పించేటప్పుడు 18604 పదాలను అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ ఉపయోగించారు. ఈయన పేరిట సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా రికార్డు ఉండేది. 2018లో అరుణ్ జైట్లీ 18, 604 పదాలతో ప్రసంగించి మన్మోహన్ సింగ్ తర్వాతి స్థానంలో నిలిచారు. ఇక నిర్మలాసీతారామన్ ఫిబ్రవరి 1 20 24 తో వరుసగా ఆరవ బడ్జెట్ సమర్పించనున్నారు. మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు సంవత్సరాల పాటు కేంద్ర బడ్జెట్ సమర్పించిన రెండవ ఆర్థిక మంత్రిగా నిర్మల రికార్డు సృష్టించారు.. ఇక ఇప్పటివరకు దేశంలో 77 రెగ్యులర్ బడ్జెట్ లు, 14 తాత్కాలిక బడ్జెట్లు ప్రవేశపెట్టారు.

1947 ఆగస్టు 14 అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే మూడు నెలలకు 1947 నవంబర్ 26వ తేదీన దేశంలో తొలి తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఆ సమయంలో 171.05 కోట్ల ఆదాయం వస్తుందని అప్పటి ప్రభుత్వం అంచనా వేసింది. 1947 నవంబర్ 26న స్వతంత్ర భారత్లో షణ్ముగం చెట్టి తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు 1860లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. యూకే కాలమానం అనుగుణంగా సాయంత్రం ఐదు గంటలకు భారత బడ్జెట్ ఉండేది. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఫిబ్రవరి నెలలో చివరి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. బ్రిటిష్ కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. 1999లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా ఆ విధానానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం సాధారణ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మూడు నెలల కాలానికి సంబంధించి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు