Homeఅప్పటి ముచ్చట్లుBrahmanandam: ఆ విషయం లో జంధ్యాల ని అవమానించిన బ్రహ్మనందం...

Brahmanandam: ఆ విషయం లో జంధ్యాల ని అవమానించిన బ్రహ్మనందం…

Brahmanandam: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చాలా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత మరికొంతమందిని ఆదరిస్తూ వాళ్లకు హెల్ప్ చేస్తూ ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తూ వాళ్లని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే కామెడీ దర్శకుడుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న జంధ్యాల ఒకప్పుడు మంచి సినిమాలు చేసి అందరిని అలరించారు.

అలాగే తను రైటర్ గా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా డైరెక్టర్ గా మారి మంచి సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం మనం హాస్య బ్రాహ్మ అని పిలుచుకునే బ్రహ్మానందాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. మొదటగా ఒక చిన్న క్యారెక్టర్ లో బ్రహ్మానందాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆ తర్వాత ఆహ నా పెళ్ళంట అనే సినిమాలో అరగుండు అనే క్యారెక్టర్ తో తనకు ఇండస్ట్రీలో ఒక లైఫ్ ని ఇచ్చిన వ్యక్తి జంధ్యాల…

ఇక బ్రహ్మానందం కూడా తనకు సినిమా ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది జంధ్యాల గారనే చెప్తూ ఉంటారు. ఇక ఒకానొక టైమ్ లో ప్లాప్ సినిమాలు చేసి జంధ్యాల భారీగా నష్టపోయారు. ఇండస్ట్రీ లో ఆయన సంపాదించిందాని కంటే పోగొట్టుకుందే ఎక్కువగా ఉంటుంది. అయితే ఒకసారి ఆయనకి డబ్బుల అవసరం రావడం తో తన ప్రియ శిష్యుడు అయిన బ్రహ్మానందం ని అడుగుదాం అని ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే బ్రాహ్మనందం స్టార్ కమెడియన్ గా మంచి గుర్తింపు సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నాడు. అలాంటి సమయం లో బ్రహ్మానందం దగ్గరికి వెళ్లి తనకి కొంత డబ్బు కావాలని అడిగి అలాగే దాన్ని మళ్ళీ చెల్లిస్తానని కూడా జంధ్యాల చెప్పాడట అయితే బ్రహ్మానందం మాత్రం తన దగ్గర డబ్బులు ఉన్నా కూడా నా దగ్గర డబ్బులు లేవు అంటూ చెప్పి అతన్ని అవమానించినట్టుగా మాట్లాడాడు అంటూ అప్పట్లో చాలా వార్తలు కూడా వచ్చాయి. ఇక దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన జంధ్యాల అక్కడి నుంచి డైరెక్ట్ గా ఇంటికి వెళ్లి చాలా బాధపడ్డట్టుగా తెలుస్తుంది.

ఇక ఇది జరిగిన తర్వాత బ్రహ్మానందం ఒక షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అక్కడున్న తన కోఆర్టిస్టు తో ఇలా జంధ్యాల గారు డబ్బులు అడిగారనే విషయాన్ని చెప్పడంతో ఆ సినిమా డైరెక్టర్ అయిన ఇవివి సత్యనారాయణ కి ఈ విషయం తెలిసింది. ఇక దాంతో జంధ్యాల గారికి అవసరం ఉన్న డబ్బులు ఇస్తాను అంటే ఆయన తీసుకోరు కాబట్టి అతన్ని ఇంటికి లంచ్ కి ఆహ్వానించి డబ్బులు ఇద్దాం అప్పుడైతే కాదనరు అని ఇవివి గారు అనుకొని జంధ్యాలని సతీ సమేతం గా పిలవడం తో జంధ్యాల దంపతులు ఇద్దరూ ఇవివి సత్యనారాయణ వాళ్ళ ఇంటికి వచ్చి లంచ్ చేశారు.ఇక అప్పుడు ఇవివి సత్యనారాయణ జంధ్యాల గారి భార్య కి చీరను పెట్టి జంధ్యాల గారికి ఎంతైతే డబ్బు కావాలని బ్రహ్మానందాన్ని అడిగాడు. అంత డబ్బు మొత్తాన్ని ఇచ్చి తన కాళ్లు మొక్కడట. ఇవివి సత్యనారాయణ డైరెక్టర్ అవ్వక ముందు జంధ్యాల దగ్గర చాలా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.ఆ కృతజ్ఞతతోనే ఆయనకి డబ్బుల సహాయం చేశాడు. ఇక జంధ్యాల డబ్బులను వద్దు అని చెప్పినప్పటికీ ఇవివి సత్య నారాయణ మాత్రం వెనక్కి తీసుకోకుండా ఆ డబ్బులని తనకి ఇచ్చి పంపించినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ డబ్బులు తీసుకున్న క్రమంలో జంధ్యాల ఎమోషనల్ గా ఫీల్ అవుతూ నేను సహాయం చేసిన చాలా మంది నాకు సహాయం చేయలేదు. ఏ సహాయం చేయని నీవు మాత్రం నాకు చాలా సహాయం చేశావు అంటూ ఇవివి తో అన్నాడు. ఇక దాంతో ఇవివి గారు నేను మీ దగ్గర సినిమా డైరెక్షన్ ఎలా చేయాలి అనేది నేర్చుకున్నాను సార్ దానికి గురుదక్షిణగా ఇది ఇచ్చాను అనుకోండి సార్ అంటూ చెప్పడంతో జంధ్యాల ఆ డబ్బులు తీసుకొని అక్కడినుంచి తన ఇంటికి వెళ్ళిపోయాడు. అలా బ్రహ్మానందం తన గురువైన జంధ్యాల గారికి సహాయం చేయకుండా మోసం చేశారంటు అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి… ఇక ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న చాలా మంది జంధ్యాల గారి అభిమానులు బ్రహ్మానందం తన జీవితంలో ఎంత సంపాదించిన, ఎన్ని రికార్డు సృష్టించిన కూడా వేస్ట్ అంటూ బ్రహ్మానందం గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే గురువుకి ఆపద వచ్చినప్పుడు ఆదుకోలేని వాడు ఏం మనిషి అంటూ తన గురించి చాలా మంది బ్యాడ్ గా మాట్లాడుతున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...
Oktelugu Epaper
Exit mobile version