ShahRukh Khan – Ram Charan : ధూమ్ 4లో షారుఖ్ ఖాన్ vs రాంచరణ్.. ఈ చేజింగ్ తో ఫ్యాన్స్ నరాలు కట్ అవ్వడం ఖాయం…

ఇందులో షారుక్ ఖాన్ దొంగ గా నటిస్తే, రామ్ చరణ్ పోలీస్ గా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే రావాల్సి ఉంది.

Written By: Gopi, Updated On : December 29, 2023 8:45 pm
Follow us on

ShahRukh Khan – Ram Charan :  ప్రస్తుతం పాన్ ఇండియాల హవా నడుస్తుంది ఏ సినిమా అయినా కూడా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు. మన స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా సినిమా పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ మంచి కాన్సెప్ట్ లతో వస్తు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటున్నారు. అలాగే ఇప్పుడు పాన్ ఇండియాలో మల్టీస్టారర్లకు కూడా చాలా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో మల్టీస్టారర్ సినిమాల పైన విపరీతమైన అంచనాలు పెరుగుతున్నాయి…

ఇక అందులో భాగంగానే ఇప్పుడు మరో మల్టీస్టారర్ సినిమా తెరపైకి వచ్చింది. బాలీవుడ్ బాద్షాగా పిలుచుకునే షారుక్ ఖాన్ అలాగే త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న రామ్ చరణ్ ఇద్దరికాంబినేషన్ లో ధూమ్ ఫోర్ సినిమా తెరకెక్కిబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాని యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటివరకు ధూమ్ సిరీస్ లో జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు నటించారు. ఇక ధూమ్ 4 కోసం షారుక్ ఖాన్ రామ్ చరణ్ రంగం లోకి దిగబోతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేయలేదు కానీ ప్రొడ్యూసర్లు మాత్రం యశ్ రాజు ఫిలిమ్స్ వాళ్ళే ఉంటారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ధూమ్ సిరీస్ ఎప్పుడు వచ్చిన కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచే విధంగా దర్శక నిర్మాతలు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఇందులో షారుక్ ఖాన్ దొంగ గా నటిస్తే, రామ్ చరణ్ పోలీస్ గా నటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది యశ్ రాజ్ ఫిలిమ్స్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే రావాల్సి ఉంది…ఈ కాంబినేషన్ లో సినిమా కనక వస్తే అది సూపర్ సక్సెస్ అవుతుంది అనడం లో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు.