Bolisetti Satya : టీవీ9 రజినీకాంత్ గూబ పగిలిపోయే ఆన్సర్ ఇచ్చిన బొలిశెట్టి సత్య

బొలిశెట్టి ఇచ్చిన సమాధానంతో రజినీకాంత్ నోరు మూసుకోవాల్సి వచ్చింది. మహిళలు మిస్ అయిన రాష్ట్రాలన్నీ దేశంలోనే అత్యంత పారిశ్రామిక రాష్ట్రాలు, ముంబై, కోల్ కతా, రాజస్థాన్, హైదరాబాద్ వంటి నగరాలు ఉన్నాయి.

Written By: NARESH, Updated On : July 11, 2023 4:34 pm
Follow us on

Bolisetti Satya : ‘కొడితే దిమ్మదిరిగిపోవాలి.. మాటల తూటాలు పేల్చితే అవతల వ్యక్తి గమ్మున మూసుకొని కూర్చోవాలి.. అలాంటి ఆన్సర్లు ఇచ్చినప్పుడే కదా మన టాలెంట్ బయటపడేది. ఇప్పుడు జనసేన నేత బొలిశెట్టి సత్య కూడా అదే పనిచేశాడు.

టీవీ9.. దీనికి ప్రచారం ఎక్కువ.. కంటెంట్ తక్కువ అంటారు. అందులో పనిచేసే జర్నలిస్టులు తామకేవో ప్రత్యేక అధికారాలు ఉన్నట్టు తమ స్టూడియో డిబేట్లకు వచ్చేవారిని అదలిస్తారు.. ప్రశ్నలతో బెదిరిస్తారు. ఇప్పటికే టీవీ9 యాంకర్లు, జర్నలిస్టుల ఓవరాక్షన్ పై కొందరు గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. అప్పట్లో టీవీ9 దేవికి హీరో విశ్వక్ సేన్ ఇచ్చిన ‘ధమ్కీ’ని ఎవరూ మరిచిపోరు. ఇప్పుడు జనసేన నేత బొలిశెట్టి ఏకంగా టీవీ9 ను నడిపిస్తున్న రజినీకాంత్ గూబ గుయ్యిమనే ఆన్సర్ ఇచ్చి ఆయన నోరు మూయించాడు.

రజినీకాంత్ తన స్టూడియోకు వచ్చిన వారిని ఎవరినీ వదలడు. తన పర అన్న బేధం లేకుండా వాయించేస్తుంటాడు. ఇటీవల మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు ఆయన ఆస్తులపై ప్రశ్నలు అడిగి ఇరుకునపెట్టాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీలో వలంటీర్ల వల్ల అక్కడి ఒంటరి మహిళలు మిస్ అవుతున్నారని ఆరోపించడంతో లెక్కలు బయటకు తీశాడు.

రజినీకాంత్ ఏకంగా దేశవ్యాప్తంగా ఏఏ రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా మిస్ అయ్యారో డేటా తెలిపారు. ‘మహారాష్ట్రలో ఒక్క సంవత్సరంలో అత్యధికంగా 37వేల మంది మిస్ అయ్యారు. మధ్యప్రదేశ్ లో 35వేల మంది మహిళలు మిస్ అయ్యారు. బెంగాల్ లో 30వేల మంది కనిపించడం లేదు. రాజస్థాన్ లో 20వేల మంది, తమిళనాడులో 17వేలు, పక్కనున్న తెలంగాణలో 13వేల మంది మిస్ అయ్యారని.. దేశంలో ఏపీలో కేవలం 10వేల మిస్సింగ్ కేసులే నమోదయ్యాయని.. 11వ స్థానంలో ఏపీ ఉందని.. అన్ని రాష్ట్రాల్లో వలంటీర్ వ్యవస్థ లేదు కదా? ఎలా మిస్ అయ్యారు’ అంటూ రజినీకాంత్ సూటిగా ప్రశ్నించారు.

దీనికి బొలిశెట్టి ఇచ్చిన సమాధానంతో రజినీకాంత్ నోరు మూసుకోవాల్సి వచ్చింది. మహిళలు మిస్ అయిన రాష్ట్రాలన్నీ దేశంలోనే అత్యంత పారిశ్రామిక రాష్ట్రాలు, ముంబై, కోల్ కతా, రాజస్థాన్, హైదరాబాద్ వంటి నగరాలు ఉన్నాయి. అక్కడ ఎన్ని కంపెనీలు ఉన్నాయో చూడండి.. ఎన్ని కోట్ల మంది జనం అక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెళుతారు. కానీ ఏపీలో అలాంటి పారిశ్రామిక ప్రాంతం కాదు.. ఇక్కడికి ఏ రాష్ట్రం నుంచి వలసలు రారు. ఇక్కడ మిస్ అయ్యారంటే మిస్ చేశారని అర్థం.. ఆమాత్రం తెలియదా? అంటూ రజినీకాంత్ చెంప చెళ్లుమనేలా బొలిశెట్టి ఆన్సర్ ఇచ్చారు.

ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

https://twitter.com/PrasannaNalle/status/1678417579000381443?s=20