Modi vs TDP: ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షంగా బీజేపీ ఎదగాలని ఎంపీలకు దిశానిర్ధేశం చేసినట్టు సమాచారం. ఈ మేరకు గురువారం రాత్రి వారికి ఇచ్చిన అల్పాహార విందులో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై మోడీ క్లుప్తంగా చర్చించారని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ స్థానంలో బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలవాలని వారికి హితబోధ చేసినట్టు తెలిసింది.

‘తెలంగాణలో కాంగ్రెస్ తన ప్రాబల్యాన్ని వేగంగా కోల్పోతోంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ దాదాపు కనుమరుగైంది. కాబట్టి బీజేపీ వారి స్థానాలను ఆక్రమించుకొని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలి’ అని రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు మోడీ సూచించారు. పొత్తుల కోసం చూడకుండా ఈ రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా ఎదగాలని ప్రధాని సూచించినట్లు తెలుస్తోంది.
ఏపీలో టీడీపీ పట్టు కోల్పోయిందని చెప్పడం ద్వారా ఇక ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు కుదుర్చుకునే అవకాశాలు లేవని ప్రధాని క్లియర్ కట్ గా ఎంపీలకు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అన్ని స్థాయిలలో స్వతంత్ర శక్తిగా ఎదగడానికి రాష్ట్ర బీజేపీకి కేంద్రం అన్ని విధాలా సహాయం చేస్తుందని మోడీ పార్టీ నాయకులకు హామీ ఇచ్చారని సమాచారం. డిసెంబర్ 28న విజయవాడలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.
Also Read: ఆ మాజీ న్యాయమూర్తులు జగన్ కు అందుకే సపోర్టు చేశారట.. ఇదేం న్యాయం చంద్రబాబూ?
ఏపీలోని వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థికవ్యవహారాల్లో అవకతవకలు, అధికార వైసీపీ అరాచకాలు,రాజకీయ ప్రత్యర్థులపై కఠోరమైన దాడులను బయటపెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. రాజ్ నాథ్, లేదా నితిన్ గడ్కరీ, అమిత్ షా,జేపీ నడ్డా వంటి పెద్ద జాతీయ బీజేపీ నాయకుడిని బహిరంగ సభకు ఆహ్వానించాలని కోర్ కమిటీ నిర్ణయించింది. ఇది కార్యకర్తలను ఉత్తేజపరుస్తుంది. పార్టీ కార్యాచరణ ప్రణాళికకు తీవ్రతను తెస్తుంది.
డిసెంబరు 28న జరిగే బహిరంగ సభకు ఏర్పాట్లను చేయడానికి అధికారుల నుంచి అనుమతి తీసుకోవడానికి సబ్ కమిటీ ని నియమించనున్నట్టు పార్టీ నాయకుడు తెలిపాడు.
Also Read: ఉసురుమనిపించిన ఉద్యోగ సంఘాలు.. ఇంతకీ సాధించిందెంటీ?