Chandrababu IT Notice: చంద్రబాబుకు నోటీసులపై షాకిచ్చిన బిజెపి

ఈ ముడుపుల వ్యవహారంలో చంద్రబాబుకు ఇప్పటివరకు నాలుగు నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇవి బయటకు రాకుండా కేంద్రమే మేనేజ్ చేసిందన్న టాక్ నడుస్తోంది.

Written By: Dharma, Updated On : September 7, 2023 10:30 am

Chandrababu IT Notice

Follow us on

Chandrababu IT Notice: టిడిపి, బిజెపి మధ్య బంధం బలపడుతోందా? చంద్రబాబుకు కేంద్రం అన్ని విధాలుగా సాయపడుతోందా? అందుకే ఐటీ నోటీసులను లైట్ తీసుకుందా? అందుకే ఏపీ బీజేపీ నేతలు భిన్న ప్రకటనలు చేస్తున్నారా? సమర్థించే ప్రయత్నాలు అందులో భాగమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణలో కవితకు లిక్కర్ స్కాంలో నోటీసులు అందిన వెంటనే బిజెపి హడావిడి చేసింది. కానీ ఏపీలో చంద్రబాబు విషయానికి వచ్చేసరికి మాత్రం గోప్యత పాటిస్తోంది. పైగా వెనుకేసుకొచ్చేలా బిజెపి వ్యవహార శైలి ఉంది.

ఈ ముడుపుల వ్యవహారంలో చంద్రబాబుకు ఇప్పటివరకు నాలుగు నోటీసులు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇవి బయటకు రాకుండా కేంద్రమే మేనేజ్ చేసిందన్న టాక్ నడుస్తోంది. అదే నిజమైతే ఇప్పుడు తాజాగా 153 సి నోటీసు ఎందుకు ఇచ్చినట్టు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒకవేళ చంద్రబాబుతో చెలిమిని కోరుకుంటే ఈ నోటీసును సైతం ఇచ్చి ఉండేవారు కాదు కదా. కానీ రాష్ట్ర బిజెపి నాయకుల వ్యవహార శైలి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబు నోటీసులు పై స్పందించారు. ఆదాయ పన్ను నోటీసులను సర్వసాధారణంగా తేల్చేశారు. అవి అందరికీ వస్తుంటాయని లైట్ తీసుకున్నారు. అటు బిజెపి నాయకుడు సత్య కుమార్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. వారికి హై కమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయో.. లేదో కానీ.. చంద్రబాబుకు వెనుకేసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. బిజెపితో పొత్తు కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న వేళ.. రాష్ట్ర బిజెపి నాయకులు నుంచి ఈ తరహా మద్దతు రావడం చంద్రబాబుకు ఉపశమనం కలిగించే విషయమే. కానీ ఈ కేసు విషయంలో కేంద్ర పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు.

ఈ కేసు విషయంలో స్పందించిన రాష్ట్ర బిజెపి నాయకులు వచ్చే ఎన్నికల్లో టిడిపి తో కలిసి నడవాలని బలంగా కోరుకుంటున్నారు. తద్వారా ఎంపీ, ఎమ్మెల్యే పదవులు పొందాలనుకుంటున్నారు. అందుకే టిడిపికి సానుకూల ప్రకటనలు చేస్తున్నారు. కేంద్ర పెద్దల మదిలో ఏముందో తెలియడం లేదు. వారు చంద్రబాబుకు ఫేవర్ చేస్తే.. 153 సి నోటీసు జారీ చేయడం ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఈపాటికి చంద్రబాబుకి మూడు నోటీసులు అందించారని.. ఇప్పుడు జారీ చేసిన నోటీస్ సైతం చిన్నదేనని.. వైసీపీ మసిపూసి మారేడు కాయ చేస్తుందని.. దానివల్ల చంద్రబాబుకు వచ్చే నష్టం ఏమీ లేదని విశ్లేషణలు వెలువడుతున్నాయి. చంద్రబాబు సానుభూతి కోసమే తనను అరెస్టు అరెస్టు చేస్తారని ప్రకటించారని గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు ఇచ్చిన నోటీసులపై బిజెపి ప్రకటనలు మాత్రం ట్విస్టులను తలపిస్తున్నాయి.