Raghunanadan Rao: హైదరాబాద్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపుతోంది. ఈ రేప్ కేసులో ఓ మంత్రి మనవడు.. ఓ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్టు ఆరోపణలు వచ్చినా వాటిని పోలీసులు , మంత్రి మనవడు ఖండించారు. అయితే సడెన్ గా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం పెట్టి గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డ వారి ఫొటోలు, వీడియోలు బయటపెట్టడం సంచలనంగా మారింది.

ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో మీడియాను, ప్రజలకు ఇన్నాళ్లు ఎమ్మెల్యే కుమారుడు, మంత్రి మనవడు లేడని చెప్పుకొచ్చిన పోలీసులు ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డట్టు అయ్యింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కేసు విచారణ పోలీసులకు అగ్ని పరీక్షలా మారింది. కొంతమంది ప్రముఖుల పిల్లలకు ఈ నేరంతో సంబంధం ఉందనే ఆరోపణలు రావడంతో ఇది రాజకీయ వివాదంగానూ మారింది.
తాజాగా పోలీసులు కొంతమదికి క్లీన్‌చిట్ ఇవ్వడం.. మరుసటి రోజే బీజేపీ నేతలు గ్యాంగ్‌రేప్‌లో వారు ఉన్నట్లు ఫొటోలు, వీడియో మీడియాకు విడుదల చేయడం సంచలనంగా మారింది. డీసీపీ ప్రముఖుల పిల్లలకు క్లీన్‌చిట్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే.. బీజేపీ నేతలు గ్యాంగ్ రేప్ కేసులో ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు ఆధారాలు బయట పెట్టారు. అయితే మైనర్లు అయినందున ఎంతవరకు చూపాలో అంతరకే చూపుతున్నామని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. పోలీసులు క్లీన్‌చిట్ ఇవ్వడంలోనే ఏదో జరుగుతుందని అర్థమవుతుందని, కావాలంటే ఈ ఆధారాలను పోలీసులకు ఇస్తామని తెలిపారు. సీసీ ఫుటేజీలను ఎడిట్ చేశారని ఆరోపించారు. జుడీషియల్ లేదా సీబీఐ విచారణ జరుపాలని డిమాండ్ చేశారు.
రఘునందన్ రావు స్వయానా ఒక లాయర్. ఆధారాలు సేకరించడంలో ఆరితేరిన దిట్ట. ఇదివరకూ హైకోర్టుల్లో.. పలు కేసుల్లో ఆయన ఇలాంటి ఎన్నో ఆధారాలు సంపాదించి ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టారు. కోర్టుల్లో గట్టిగా వాదించారు. కాబట్టి బాధిత బాలిక లేదా అత్యాచార ఘటనకు పాల్పడిన ఏదో ఒక ఫ్యామిలీ నుంచి ఎలాగోలా ఈ వీడియోలు సంపాదించారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బీజేపీ నేతలు బయటపెట్టిన ఆధారాలతో పోలీసులు ఖంగుతున్నారు. ఆ వీడియోలు, ఫొటోలు ఎలా బయటకు వచ్చాయని, దీనిపై ఎలాంటి చర్య తీసుకోవాలని సందిగ్ధంలో ఉన్నారు. దోషులను శిక్షించడం కంటే ముందు రఘునందన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే రఘునందన్‌రావు ఆధారాలను సుప్రీం కోర్టుకు సమర్పిస్తానని, ఇంకా ఇలాంటి ఆధారాలు చాలా ఉన్నాయని ప్రకటించడంలో చర్యలు తీసుకుంటే ఇంకా ఏయే ఫొటోలు, వీడియోలు బయటకు వస్తాయో.. తమ మెడకు ఏమైనా చుట్టుకుంటుందా అనే భయం పోలీసుల్లో కనబడుతోంది.
ఇప్పటికే పొలిటికల్ టర్న్ తీసుకున్న ఈ ఘటన ఆధారాలు బయటకు రావడంతో మళ్లీ ఎలాంటి సంచలనం నమోదవుతుందో వేచిచూడాలి.
[…] […]