5 state Election Results: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అదికారం నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 403 స్థానాల్లో చూస్తే ప్రధాన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఏకంగా 263 స్థానాల్లో లీడ్ తో దూసుకుపోతోంది. ఇక కాంగ్రెస్ తోపాటు బీఎస్పీ సైతం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతోంది.

ఇక పంజాబ్ లోని 117 స్థానాల్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అందరినీ ఊడ్చేస్తోంది. అక్కడ క్లియర్ కట్ మెజార్టీతో అధికారంలోకి రాబోతోంది. మేజిక్ ఫిగర్ దాటి ఆప్ పార్టీ 88 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 13, బీజేపీ కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. సీఎం చన్నీ పోటీచేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉంది.
ఇక ఉత్తరాఖండ్ లో మొత్తం 70 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ 42, కాంగ్రెస్ 24 , ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
ఇక మణిపూర్ లో 60 స్థానాల్లో సైతం బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ 23, కాంగ్రెస్ 18, ఎన్పీఎఫ్ 3, ఎన్పీఈపీ 10, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ హంగ్ వచ్చే అవకాశాలున్నాయి. చిన్న పార్టీలు కీలకంగా మారాయి.
గోవాలోని మొత్తం 40 సీట్లలో బీజేపీ 16, కాంగ్రెస్19, ఆప్ 1, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా హంగ్ ఖాయంగా కనిపిస్తోంది.
[…] 5 State Election Results 2022: దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. బీజేపీకి ఎదురు లేదని నిరూపించాయి. ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో బీజేపీకి అవకాశాలు లేవని భావించినా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ నాలుగు రాష్ట్రాల్లో అప్రతిహ విజయయాత్ర కొనసాగిస్తోంది. కానీ పంజాబ్ లో మాత్రం అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విజయపథంలో దూసుకుపోతోంది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికే పరిమితమవుతోంది. దేశంలో కాంగ్రెస్ పతనం పతాక స్థాయికి చేరుతుందని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అయిదు రాష్ట్రాల్లో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావం చూపలేకపోతోంది. […]
[…] Assembly Election Results 2022: దేశంలో సెమీఫైనల్స్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లో దాదాపు గెలవబోతోంది. ఇక కాంగ్రెస్ అధికారంలోని పంజాబ్ ను ఆమ్ ఆద్మీ హస్తగతం చేసుకుంటోంది. దేశంలో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీపై విరుచుకుపడడానికి ప్రాంతీయ పార్టీల నేతలంతా కాచుకూర్చున్నారు.కానీ అదేం జరగలేదు. మళ్లీ బీజేపీనే దేశంలో అధికారంలోకి వస్తుందని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తేలబోతోంది. […]
[…] Assembly Election Results 2022: గోవిందా గోవిందా? అన్నట్టుగానే కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఆశలు.. జాతీయ రాజకీయాలపై అంచనాలు తప్పిపోయాయి. దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే ఇక దేశమంతా తిరిగి ఆ పార్టీని కడిగేసి జాతీయ స్థాయిలో నాయకుడిగా చెలామణీ అవుదామని కేసీఆర్ ఎన్నో కలలు కన్నారు. కానీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. మోడీ ప్రభ తగ్గలేదని.. బీజేపీపై ప్రజల్లో ప్రేమ చావలేదని నిరూపితమైంది. […]