Dr Lakshman Chandrababu: డా. కే లక్ష్మణ్.. బీజేపీలో మంచి విద్యాధికుడు.. విశ్లేషకుడిగా పేరుగాంచాడు. మంచి పాజిటివ్ రాజకీయ వేత్తగా పేరుగాంచాడు. ముషీరాబాద్ ఎమ్మెల్యేగా.. ఇప్పుడు ఏకంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డులో స్తానం సంపాదించే దాకా ఎదిగాడు. వెంకయ్య నాయుడు, బంగారు లక్ష్మణ్ తర్వాత అత్యున్నత స్థానంలోకి వెళ్లింది డా. లక్ష్మణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి లక్ష్మణ్ ను మనం అభినందించాల్సిందే…

తెలంగాణలో బీజేపీ బలపడడానికి వ్యూహరచన చేస్తున్నారు. కాకపోతే తెలంగాణలో బీజేపీ బలపకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి,. అందులో ప్రధానంగా కొన్ని జిల్లాల్లో నేతలు, క్యాడర్ లేదు. ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో అస్సలు బీజేపీకి బలం లేదు. ఇంకో కారణం ఏంటంటే? జీహెచ్ఎంసీలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీమాంధ్ర ఓటర్లు గణనీయంగా ఉన్నారు. వీరిలో బీజేపీకి అస్సలు సపోర్ట్ గా లేరు. పోయిన సారి తెలంగాణ ఎన్నికల్లో మెజార్టీ టీఆర్ఎస్ కు.. తర్వాత కాంగ్రెస్ కు సీమాంధ్ర ఓటర్లు ఓట్లు వేశారు.
దక్షిణ తెలంగాణలో బీజేపీకి పట్టు లేకపోవడంతో ఇతర పార్టీల నుంచి నేతలను లాగి బలపడాలని చూస్తున్నారు. సీమాంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం కోసం కొన్ని వ్యూహాలు అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. సీమాంధ్ర ఓటర్ల కోసం చంద్రబాబుతో మంతనాలు జరుపుతున్నారా? అని ప్రశ్నించగా లక్ష్మణ్ ఓ ఇంటర్వ్యూలో కాదు అని చెప్పారు.
చంద్రబాబుతో సీమాంధ్ర ఓట్ల కోసం తెలంగాణలో లక్ష్మణ్ సంప్రదింపులు జరుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని లక్ష్మణ్ సైతం ఖండించలేని పరిస్థితి. చంద్రబాబు హస్తం భస్మాసుర హస్తం. బీజేపీ కనుక చంద్రబాబు పంచన చేరితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతిన్నట్టే బీజేపీ దెబ్బతినడం ఖాయం. టీఆర్ఎస్ కు ఆయుధంగా మలిచింది. చంద్రబాబును బూచీగా చూపి కాంగ్రెస్ ను ఓడించాలని కేసీఆర్ చేసిన ప్రచారం విజయవంతమైంది. ఇప్పుడు బీజేపీ కూడా సీమాంధ్ర ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నిస్తుండడంతో కేసీఆర్ కు మరో అస్త్రంగా మారడం ఖాయం. తెలంగాణలో బీజేపీ ఓడిపోవడం తథ్యం. ఈ క్రమంలోనే ఈ తప్పు బీజేపీ చేస్తుందా? లేదా? చేస్తే ఏమవుతుందన్న విషయంపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.