BJP Vote Bank Politics: కాంగ్రెస్ బాటలోనే బీజేపీ కూడా ప్రయాణం చేస్తోంది. అన్ని విషయాల్లో కాకపోవచ్చు కానీ.. అధికారం కోసం బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడ మధ్యతరగతి వారిలో బీజేపీపై వ్యతిరేకతకు దారితీస్తోంది. కర్ణాటకలో కాంట్రాక్టర్ ఆత్మహత్య.. అధికార మార్పిడి కోసం బీజేపీ వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసిన వైనం విమర్శల పాలైంది. అధికారం కోసం బీజేపీ ఇలా దిగజారుతుందనడానికి లేదు. అదో రాజకీయ క్రీడ.

గుజరాత్ లో మాత్రం దారుణం జరిగింది. బిల్కీస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడం దేశమంతా దుమారం రేపింది. కేవలం గుజరాత్ లో వారి ఓట్ల కోసం ఇలా చేయడం అత్యంత దారుణమనే చెప్పాలి. ప్రెగ్నెంట్ అయిన ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. కోర్టు ఈ కేసులో 11 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు.
సుప్రీంకోర్టును బాధితులు తాజాగా ఆశ్రయించగా.. ప్రభుత్వం వారి సత్ప్రవర్తన ఆధారంగా క్షమాభిక్ష పెట్టవచ్చని తీర్పు ఇచ్చింది. నిర్భయ ఘటనలో ఇదే రేప్ చేసి చంపేస్తే మరణశిక్ష వేయాలని దేశమంతా వాదించారు. ఇదే బీజేపీ నేతలు నాడు గట్టిగా నిలదీశారు. ఇప్పుడు మాత్రం ఇదే బీజేపీ ప్రభుత్వం ఓట్ల కోసం 11 మందికి క్షమాభిక్ష పై విడుదల చేసి సంబరాలు చేసి సన్మానం చేయడం దేశవ్యాప్తంగా అందరినీ విస్మయానికి గురిచేసింది.
గ్యాంగ్ రేప్ చేసి చంపిన నిందితులకు స్వీట్లు, సన్మానాలు చేయడం చీచీ ఇదేం రాజకీయం అన్న రీతిలో సాగుతోంది. వచ్చే ఎన్నికల కోసం బీజేపీ హిందూ ఓట్ల కోసం ఇంత నీచానికి దిగజారుతారా? కాంగ్రెస్ వాళ్లకు తమకు తేడా లేదని బీజేపీ నిరూపించినట్టైంది. కాంగ్రెస్ బాటలోనే బీజేపీ నడుస్తుందని అర్థమవుతోంది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..