పూరి జగన్నాథ్.. డేర్ అండ్ డాషింగ్ కి సింబాలిజం, కమర్షియల్ సినిమాలకు పర్ఫెక్ట్ డెఫినిషన్.. పూరి కథాంశంలో ఒక ఆవేశం ఉంటుంది, పూరి పాత్రల్లో జీవితాలు ఉంటాయి. పూరి యాక్షన్ లో ఎమోషన్ ఉంటుంది. పూరి మాస్ ఎలిమెంట్స్ లో ఒక విజన్ ఉంటుంది. అందుకే.. ‘పూరి’ అనే పదమే ఒక స్టైల్ అయింది.

నేటి డిజిటల్ పోటీ ప్రపంచంలో తన కంటూ సెపరేట్ మార్క్ క్రియేట్ చేసుకోవడం, పైగా తన మార్క్ ను దశాబ్దాలుగా సక్సెస్ ఫుల్ గా నిలబెట్టుకుంటూ రావడం ఒక్క పూరికే సాధ్యం అయింది. బహుశా అందుకే పూరి ఓ ప్రత్యేకమైన బ్రాండ్ అయ్యాడు. ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకోగలిగాడు. అసలు దర్శకులకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ జనరేషన్ లో పూరీతోనే మొదలైంది.
నేడు పూరి పుట్టినరోజు.. ఈ సందర్భంగా పూరి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు విశేషాలు. 30 ఏళ్ల సినీ కెరీర్ లో పూరి ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాడు. పూరి జగన్నాథ్ సెప్టెంబర్ 28 1966లో జన్మించారు. 2000 సంవత్సరంలో ఫస్ట్ టైం మెగా ఫోన్ పట్టాడు. అప్పటికీ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిపోయింది. ఎన్నో కష్టాలు బాధలు పడితే… మొదటి సినిమాని పవర్ స్టార్ తో తీసే అవకాశం దొరికింది.
ఆ అవకాశాన్ని బద్రీ రూపంలో భారీ విజయంగా మార్చుకున్నాడు పూరి. కానీ రెండో సినిమా బాచీ భారీ డిజాస్టర్ అయింది. ఎన్ని కథలు చెప్పినా.. పవన్ పూరికి డేట్స్ ఇవ్వలేదు. అప్పుడే పూరి డిసైడ్ అయ్యాడు. నేనే ఒక హీరోని తయారు చేసుకోవాలి అని. అప్పుడే హీరోగా మారాడు రవితేజ. ‘ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం’ అంటూ లవ్ స్టోరీతో సూపర్ హిట్ ఇచ్చాడు పూరి.
అయితే, పూరి కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం మాత్రం ‘ఇడియట్’. ఈ సినిమా రవితేజ్ ను స్టార్ ని చేసింది. హీరోకి క్యారక్టరైజేషన్ ఇచ్చి.. దానితో సినిమాని ఎలా నడపాలో పూరి పరిశ్రమకు నేర్పించే స్థాయికి ఎదిగాడు. అసలు కేవలం వారం రోజుల్లో కథ రాసి, మరో పది రోజుల్లో డైలాగ్ లు రాసి, నెలలో సినిమాను తీసేసే ఏకైక దర్శకుడు ఒక్క ‘పూరీ జగన్నాథ్’ మాత్రమే.
పోకిరితో ఇండస్ట్రిని ఒక ఊపు ఊపేసినా… దేశముదురుతో భారీ విజయం అందుకున్నా.. చిరుతతో గౌరవాన్ని సాధించినా.. బుజ్జిగాడుతో అలరించినా.. నేనింతే అంటూ ఆ సినిమాతో నందీ అవార్డు దక్కించుకున్నా పూరి ఎప్పుడూ ఒకేలా ఉంటాడు .
ఓ దశలో పర్సనల్ లైఫ్ లో ఆస్తులు మొత్తం పోగొట్టుకుని ఎన్ని కష్టాలు పడినా.. ఎంతగానో డౌన్ ఫాల్స్ చూసినా పూరి ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు కూడా. మళ్లీ అంతే స్పీడ్ గా కమ్ బ్యాక్ అయ్యాడు. అందుకే.. ఇండస్ట్రీలో పూరి అంటే ఒక చరిత్ర.. పూరి అంటే ఒక ట్రెండ్ సెట్టర్. పుట్టిన రోజు సందర్భంగా పూరీ జగన్నాధ్ కి మా ‘ఓకే తెలుగు’ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది.