సన్ రైజర్స్ హైదరాబాద్ సోమవారం జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది. అయితే జాసన్ రాయ్ రాకతో సన్ రైజర్స్ హైదరాబాద్ రాతనే మారింది. డేవిడ్ వార్నర్ స్థానంలో జట్టులోకి వచ్చిన జాసన్ రాయ్.. సన్ రైజర్స్ హైదరాబాద్ తన ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. అతని చేరికతో టీమ్ కు మంచి బ్యాలెన్స్ వచ్చింది. ఫీల్డింగ్ లోనే జాసన్ రాయ్ అదరగొట్టాడు. కీలక ఆటగాళ్ల క్యాచ్ లు అందుకున్నాడు.

ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన జాసన్ రాయ్ హాఫ్ సెంచరీతో సన్ రైజర్స్ విజయంతో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి ఫిల్డింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఆరంభంలోనే లూయిస్ ను పెవిలియన్ చేర్చి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న జైస్వాల్ ను పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత సంజూ శాంసన్ చెలరేగినా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లు కట్టడి చేసి రాజస్థాన్ ను సాధారణ స్కోర్ కే పరిమితం చేశారు. తొలి మూడు ఓవర్లు దారళంగా పరుగులిచ్చిన సిద్దార్థ్ కౌల్ చివరి ఓవర్ లో రెండు కీలక వికెట్లు తీసి 4 పరుగుు మాత్రమే ఇచ్చాడు.
అయితే ఈ మా మ్యాచ్ లో కేన్ తనదైన కెప్టెన్ తో అదరగొట్టాడు. ఫీల్డింగ్, సెటప్, బౌలింగ్ మార్పుల్లో విలియమ్సన్ కెప్టెన్సీ అద్భుతంగా చేశాడు. ముఖ్యంగా రాజస్థాన్ భారీ స్కోర్ చేయకుండా తన దైన వ్యూహాలను రచించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ సత్తా చాటాడు. చివరి వరకు క్రీజులో నిలబడి అద్భుత విజయాన్ని అందించాడు.