Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 ఈరోజే స్టార్ట్ … స్పెషల్ గెస్టులు వీరే

స్పెషల్ గెస్టులుగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, లవ్లీ బాయ్ నవీన్ పోలిశెట్టి రాబోతున్నారు. విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది.

Written By: NARESH, Updated On : September 3, 2023 6:34 pm

bigg-boss-telugu-season-7-contestants-list-with-photos-_-bigg-boss-telugu-7-confirmed-contestants-name-with-photos-20230830182044-3165

Follow us on

Bigg Boss 7 Telugu : బుల్లితెర మీద బాహుబలి లాంటి షో బిగ్ బాస్ అనే చెప్పాలి. తెలుగు బిగ్ బాస్ స్టార్ట్ అయ్యిందంటే చాలు ఎప్పుడు బుల్లితెర చూడని జనాలు కూడా అటు వైపు ఒక లుక్ వేస్తారు. అలాంటి బిగ్ బాస్ తాజాగా సీజన్ ఈ రోజే (సెప్టెంబర్ 3) న ప్రారంభం కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ మా లో ఈ రోజే టెలికాస్ట్ కాబోతుంది. కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో మీద భారీ అంచనాలే ఉన్నాయి.

వాటికీ తగ్గట్లే ఈ ఏడాది ఈ షో ను సరికొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ రియాలిటీ షో లో స్పెషల్ గెస్టులుగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, లవ్లీ బాయ్ నవీన్ పోలిశెట్టి రాబోతున్నారు. విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీనితో ప్రమోషన్స్ ను వేగం చేసిన చిత్ర యూనిట్ బిగ్ బాస్ వేదికగా ఖుషి ని ప్రమోట్ చేయబోతుంది.

మరోపక్క నవీన్ పోలిశెట్టి, అనుష్క నటించిన సరికొత్త సినిమా కూడా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుంది, దీనితో బిగ్ బాస్ ద్వారా ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి నవీన్ పోలిశెట్టి రాబోతున్నారు. దీనితో బిగ్ బాస్ 7 ప్రారంభ వేడుకలు ఒక రేంజ్ లో జరిగే అవకాశం లేకపోలేదు. పైగా ఈ సీజన్ లో గేమ్స్ కూడా సరికొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ డివైడ్ చేసి ఒక్కో హౌస్ లో 10 మెంబర్స్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు.

గేమ్ జరిగే కొద్దీ మార్పులు చేర్పులు చేస్తూ అందరిని ఒక హౌస్ లోకి తీసుకొని వస్తారు. గత సీజన్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ టాస్క్ లు. అందుకే ఈ ఏడాది సరికొత్తగా వాటిని డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఉల్టా – పల్టా అంటూ నాగ్ చేసే సందడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక హౌస్ లోకి వచ్చే కంటిస్టెంట్స్ ఎవరు అనేది బిగ్ సస్పెన్స్ అనే చెప్పాలి. ఎన్నో రకాల పేర్లు తెరమీదకు వచ్చిన కానీ బిగ్ బాస్ షో మొదలయ్యే దాకా ఎవరు అనేది కంఫర్మ్ చేయలేము.