Bigg Boss 7 Telugu : రతికా టాలెంట్ కి నాగ్ ఫిదా, పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్… ఎపిసోడ్ హైలెట్స్!

నేడు ఆదివారం కాగా నాగ్ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఒకరు ఎలిమినేట్ అవుతారు. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతారని అంచనా....

Written By: NARESH, Updated On : September 10, 2023 10:51 am
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ తెలుగు 7 ఫస్ట్ వీకెండ్ వచ్చేసింది. శనివారం హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఈ వీక్ మొత్తం కంటెస్టెంట్స్ ప్రవర్తన, పెర్ఫార్మన్స్ మీద రివ్యూ నిర్వహించాడు. అందరు కంటెస్టెంట్స్ ని తనదైన శైలిలో నాగార్జున పలకరించాడు. షకీలా ఎలా ఉన్నారని అడిగారు. అప్పుడే ఏడుపు మొదలుపెట్టిన శోభా శెట్టికి క్లాస్ పీకాడు. ఏడ్చినవారెవరు బిగ్ బాస్ షోలో ఫైనల్ కి వెళ్లలేదని హెచ్చరించాడు.

గౌతమ్ కృష్ణ వ్యవహారం నాగార్జునకు నచ్చలేదు. మొదటివారమే ప్రేమలో పడిపోయిన ఈ కుర్రాడు శుభశ్రీ చుట్టే తిరుగుతున్నాడు. ఇది గమనించిన నాగార్జున నువ్వు ఇంట్లో ఉన్నావా? లేక ఒకరి వెంటే ఉన్నావా? అని అడిగాడు. శుభశ్రీ పట్ల పొసెసివ్ గా ఉంటున్న గౌతమ్ కృష్ణ ఆమె ఇతర అబ్బాయిలతో మాట్లాడినా, సన్నిహితంగా ఉన్నా నొచ్చుకుంటున్నాడు. దీంతో గేమ్ మీద ఫోకస్ పెట్టాలని నాగార్జున పరోక్షంగా చెప్పాడు.

అలాగే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా రతికా రోజ్ తో సన్నిహితంగా ఉంటున్నాడు. ఎంట్రీ రోజు తాను ఇచ్చిన మొక్కను కూడా పట్టించుకోకుండా రతికా రోజ్ చుట్టూ తిరుగుతున్నావని నాగార్జున అన్నారు. అలాగే కిరణ్ రాథోడ్ ఎప్పుడూ ఇంగ్లీష్ లో మాట్లాడటం కూడా నాగార్జునకు నచ్చలేదు. తెలుగులో మాట్లాడేందుకు ట్రై చేయమన్నాడు.

బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ అవ్వాలన్నా పవర్ అస్త్ర గెలుచుకోవాలి. దీని కోసం కొన్ని టాస్క్స్ నిర్వహిస్తున్నారు. ఫేస్ ది బీస్ట్ టాస్క్ లో గెలిచి నెక్స్ట్ రౌండ్ కి వెళ్లిన సందీప్, ప్రియాంక సింగ్ మధ్య పోటీ పెట్టారు. ఈ గేమ్ లో గెలిచిన సందీప్ పవర్ అస్త్ర గెలుచుకున్నాడు. మొట్టమొదటి అధికారిక కంటెండర్ అయ్యాడు. ఇక పీపుల్స్ పల్స్ ప్రకారం ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో నాగార్జున వెల్లడించారు. అత్యధికంగా రతికా రోజ్ 80 మార్కులు పొందింది. తర్వాత టేస్టీ తేజా 77, శోభా శెట్టికి 76, శివాజీ, పల్లవి ప్రశాంత్ లకు 74 మార్క్స్ జనాలు వేశారు.

దాదాపు రెండున్నర గంటలపాటు ఉడుత ఉడుత ఊచ్ సాంగ్ లూప్ లో ప్లే చేశారు. ఉడుత అనే పదం ఎన్నిసార్లు వచ్చిందో చెప్పాలని నాగార్జున అడిగారు. రతికా రోజ్ 1056 సార్లు అని చెప్పింది. నాగార్జున నువ్వు గ్రేట్ అని ఆమెను మెచ్చుకున్నాడు. ఇలాంటి ఆసక్తికర విషయాలతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. నేడు ఆదివారం కాగా నాగ్ ఎంట్రీ ఉంటుంది. అలాగే ఒకరు ఎలిమినేట్ అవుతారు. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవుతారని అంచనా….