Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 తెలుగు : లక్కీ ఫెలో.. అన్న మాట విని 15 లక్షలు దక్కించుకున్న యావర్

ఇక బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విజేతగా చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచి గ్రాండ్ గా టైటిల్ గెలుచుకున్నాడు.

Written By: NARESH, Updated On : December 17, 2023 10:59 pm
Follow us on

Bigg Boss 7 Telugu : ప్రతీ సీజన్ లోనూ 50 లక్షలు కొట్టడమే మా టార్గెట్ అని క్యాష్ ప్రైజ్ ను కంటెస్టెంట్స్ రిజెక్ట్ చేస్తుంటారు. కానీ పోయిన సీజన్ లో సోహైల్ లాంటి తెలివైన ఆటగాడు దాదాపు 25 లక్షల క్యాష్ ప్రైజ్ ను తెలివిగా తను విజేత కానని.. మూడో స్థానంలో ఉన్నానని తన స్నేహితుడైన మెహబూబ్ ద్వారా తెలుసుకొని సగం డబ్బులను కొట్టేశాడు. ఆ సీజన్ లో జరిగిన అతిపెద్ద తప్పు అదే.దాని వల్ల విజేత అభిజీత్ కేవలం 25 లక్షలు మాత్రమే ప్రైజ్ మనీ దక్కించుకున్నాడు.

ఆ తప్పు జరగకుండా బిగ్ బాస్ ఈసారి ప్రైజ్ మనీని కేవలం 15 లక్షలకే పరిమితం చేశాడు. మొదటి సారి 10 లక్షలు ఆఫర్ చేయగా టాప్ 5 తిరస్కరించారు. అనంతరం 15 లక్షల ప్రైజ్ మనీ పంపగా.. టెంప్ట్ అయ్యారు. అల్లరి నరేష్, మరో హీరోతో కలిసి లోపలికి వెళ్లి అందరినీ టెంప్ట్ చేశారు. అయితే అప్పులు ఉన్నాయని ఈ డబ్బు నీకు అవసరం అంటూ నాగార్జున సూచించడం.. యావర్ అన్నయ్య కూడా డబ్బులు తీసుకో అంటూ ఆదేశించడంతో ఇక తాను విన్నర్ కాదు అని డిసైడ్ అయిపోయిన యావ్ చివరకు అన్న మాట విని 15 లక్షలు దక్కించుకున్నాడు.

బిగ్ బాస్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచారు. ఫైనల్ లో టాప్ 3గా పల్లవి ప్రశాంత్, అమర్, శివాజీ నిలిచారు. బిగ్ బస్ హిస్టరీలోనే తొలిసారి ఒక సామాన్యుడు.. ఒక రైతు బిడ్డ విజేతగా నిలిచాడు.ఇక బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విజేతగా చివరకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచి గ్రాండ్ గా టైటిల్ గెలుచుకున్నాడు.