Bigg Boss 7 Telugu : నామినేట్ అయితే దాదాపు అవుట్… ఎలిమినేషన్ భయంతో హౌస్ మేట్స్ బరస్ట్!

ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పారు. ఇక అమర్ ముందు యావర్ ని నామినేట్ చేశాడు.' ఫౌల్ గేమ్ ఆడావు.. కాలు కింద పెట్టావా అంటే పెట్టలేదని చెప్పావ్.. కానీ వీడియో లో క్లియర్ గా కనిపించింది అని అమర్ చెప్పాడు

Written By: NARESH, Updated On : November 20, 2023 3:26 pm
Follow us on

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ హెట్టిక్కిస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ లేకపోవడంతో వచ్చే వచ్చే వారం డబల్ ఎలిమినేషన్ అంటూ .. కంటెస్టెంట్స్ తో చెప్పాడు నాగార్జున. అయితే నేటి ఎపిసోడ్ లో జరగబోయే నామినేషన్ ప్రక్రియ రంగం సిద్ధమైంది. తాజా ప్రోమో లో నామినేషన్స్ ప్రక్రియ లో భాగంగా సింహం బొమ్మని పెట్టి అది బాగా ఆకలిగా ఉంది .. ఆహారం కోసం ఎదురు చూస్తుంది… మీరు ఎవరైతే హౌస్ లో ఉండటానికి అనర్హులని భావిస్తున్నారో వాళ్ళ ఫోటో ఉన్న చికెన్ ముక్కని సింహం నోట్లో వేసి నామినేట్ చేయాలి అని బిగ్ బాస్ చెప్పారు.

ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పారు. ఇక అమర్ ముందు యావర్ ని నామినేట్ చేశాడు.’ ఫౌల్ గేమ్ ఆడావు.. కాలు కింద పెట్టావా అంటే పెట్టలేదని చెప్పావ్.. కానీ వీడియో లో క్లియర్ గా కనిపించింది అని అమర్ చెప్పాడు. దాంతో యావర్ ‘ నేను కాలు కింద పెట్టినప్పుడు చూడక పోవడం నీ మిస్టేక్ అని అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ‘సరే నేను సంచాలక్ గా ఫెయిల్ కదా నన్ను నామినేట్ చెయ్ అని అమర్ అరిచాడు.

ఇక అర్జున్ బాల్ గేమ్ లో యావర్ చేసిన ఫౌల్ గురించి పాయింట్ అవుట్ చేస్తూ యావర్ ని నామినేట్ చేశాడు. తర్వాత గౌతమ్ .. ప్రశాంత్ ని నామినేట్ చేశాడు. ‘అన్నా.. వినరాదే ‘ అంటూ ప్రశాంత్ ని ఇమిటేట్ చేశాడు. గౌతమ్ రెండో నామినేషన్ శివాజీ కి వేసాడు. గేమ్స్ లో ఫౌల్స్ చేసావ్ అని గౌతమ్ చెప్పాడు. ‘ నువ్వెరివయ్యా .. నేను ఫౌల్స్ చేసానని చెప్పడానికి అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు.

ఇక రతిక, ప్రశాంత్ ని నామినేట్ చేస్తూ .. ఏదో రీజన్ చెప్పింది. ‘ వాళ్లకు దెబ్బ తగిలితే నీకు రక్తం వస్తున్నట్టు ఉందేంటి’ అని ప్రశాంత్ అడిగాడు. దాంతో ‘ అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడకు అంటూ రతిక ఓవర్ యాక్షన్ చేసింది. తర్వాత అర్జున్ శివాజీని నామినేట్ చేశాడు. ‘ అరవద్దు.. డిస్టర్బ్ చేయొద్దు’ అని అన్నారు. కానీ మీరు తర్వాత గట్టిగా అరిచారు .. అప్పుడు వాడు డిస్టర్బ్ అవ్వడా ‘ అని అడిగాడు. ఇలా ప్రోమో ముగిసింది. ఇక ఎవరెవరు నామినేట్ అయ్యారో చూడాలి మరి.