Trump Cabinet : అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోయినా తతంగం ఇంకా ముగియలేదు. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. అమెరికా పాలనకు, మన పాలనకు ప్రధానమైన తేడా ఎంటంటే.. అమెరికాలో ఎక్జిక్యూటివ్ హెడ్ ప్రెసిడెంట్ గా ఉంటారు. భారతదేశంలో ఎక్జిక్యూటివ్ హెడ్ గా ప్రధానమంత్రి ఉంటారు. అమెరికాలో పాలనలో రకరకాల కేటగిరీలు ఉంటాయి. కొన్ని కేబినెట్ ర్యాంకులు, కొన్ని నాన్ కేటగిరీ ర్యాంకులు, కొన్ని వైట్ హౌస్ కీలక పోస్టులు ఉంటాయి. కొన్ని నాన్ గవర్నమెంట్ పోస్టులు ఉంటాయి. మనకు, అమెరికాకు పాలన వ్యవస్థలో చాలా తేడాలుంటాయి. అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఒక్కొక్క పోస్ట్ కు వీరిని ఎంపిక చేసినట్టు ప్రకటిస్తున్నాడు.
విదేశాంగ మంత్రి (సెక్రటరీ ఆఫ్ స్టేట్) గా రూబియోను పెట్టాడు. లాటిన్ అమెరికన్ ను పెట్టాడు. రకరకాల పోస్టుల్లో ఇద్దరి పేర్లు వివాదమైంది. మ్యాట్ గ్యాట్ ను అటార్నీ జనరల్ గా నియమించాడు. ఈయనది వివాదమైంది. సెక్సువల్ ట్రాఫిక్ లో ఈయనపై చార్జ్ చేశారు.పెద్ద కాంట్రావర్సీ దీనిపై అయ్యింది. ఈయననే న్యాయవ్యవస్థకు హెడ్ గా చేయడం వివాదమైంది.
తులసీ గబ్బాడ్ అనే హిందూ మహిళను ఇంటెలిజెన్స్ హెడ్ గా పెట్టారు. ఒకప్పుడు ఈమెనే ఇంటెలిజెన్స్ ను టార్గెట్ చేసి దుమ్మెత్తిపోసింది. ఇక హిందువుల నియామకాలు అమెరికా కేబినెట్ లో చాలా పెరిగాయి.
అమెరికా పాలనలో రోజురోజుకీ పెరుగుతున్న భారతీయ లాబీపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.