Niharika Konidela: సెలబ్రిటీలకు వాళ్ళ అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. సోషల్ మీడియా విప్లవంతో ఎవరు ఎవరితోనైనా మాట్లాడే వెసులుబాటు ఏర్పడింది. ఇక తమ అభిమానుల కోసం తారలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులోకి వస్తూ ఉంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటారు. కాగా మెగా డాటర్ నిహారిక సైతం తరచుగా ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించిన నిహారికకు కొన్ని చిలిపి ప్రశ్నలు ఎదురయ్యాయి. వాటికి నిహారిక తమాషా సమాధానాలు చెప్పారు.

ఓ నెటిజన్ మీరు సింగిలా? అని నిహారికను అడిగారు. పెళ్లైన నిహారికకు ఆ ప్రశ్న వింతగా తోచింది. దీంతో భర్త వెంకట చైతన్యను ట్యాగ్ చేసి.. నేను సింగిలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. మరో నెటిజెన్ మీ నంబర్ కావాలని అడిగారు. దానికి ఇష్.. అనే సింబల్ పోస్ట్ చేసిన నిహారిక అది చెప్పకూడని పరోక్షంగా తెలియజేశారు. అలా నిహారిక ఇంస్టాగ్రామ్ చిట్ చాట్ ఫన్నీ గా సాగింది.
Also Read: Mahesh Babu: గుసగుస: ఆ హీరోతో పనిచేస్తే అంతేనా? వారి బరువు తగ్గాల్సిందేనా?
‘ఒక మనసు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక… తర్వాత సూర్య కాంతం, హ్యాపీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. వీటిలో ఒక్క చిత్రం కూడా విజయం సాధించలేదు. తర్వాత చిరంజీవి పాన్ ఇండియా చిత్రం సైరా నరసింహారెడ్డి లో ఓ చిన్న పాత్ర చేశారు. పెద్దల కోరిక మేరకు నిహారిక 2020లో జొన్నలగడ్డ వెంకట చైతన్యను వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక-చైతన్యల వివాహం ఘనంగా జరిగింది. మెగా హీరోలందరూ పాల్గొన్న ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

పెళ్లి తర్వాత నిహారిక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆమె నటిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. అనసూయతో పాటు ఓ వెబ్ సిరీస్ నిహారిక చేస్తున్నారు. నిహారికకు పింక్ ఎలిఫెంట్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థలో గతంలో నాన్నకుచ్చి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సిరీస్లు తెరకెక్కాయి. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ కి నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Also Read:Ram Charan-Kamal Haasan: రామ్ చరణ్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
[…] […]