Bigg Boss 6 Telugu Review: బిగ్ బాస్ ఆట మొదలుపెట్టాడు. తొలిరోజు నుంచి కంటెస్టెంట్ల నుంచి కంటెంట్ రాబట్టాడు. ముఖ్యంగా లేడీ పుష్ప గీతూ తొలి రోజు నుంచే తన ఫైరింగ్ మొదలుపెట్టేసింది. బిగ్ బాస్ తొలి రోజే గీతూతో లొల్లి మొదలైంది.. లేడీ పుష్ప ‘గీతూ’ బాత్ రాంలో ఎవరివో వెంట్రుకలు పడ్డాయని అందరి ముందు లొల్లి మొదలుపెట్టింది. దీనికి మోడల్ ఇనయా సుల్తానా రియాక్ట్ అయ్యి గీతూతో గొడవ పెట్టుకుంది..

అనంతరం బిగ్ బాస్ తొలి టాస్క్ ను ఇచ్చి నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఛాన్స్ కొందరికి ఇస్తూ ఓ గేమ్ పెట్టాడు. ‘క్లాస్’, ట్రాష్, మాస్ అనే మూడు గ్రూపులు పెట్టి ఇంటి సభ్యులను ఎంపిక చేయమన్నాడు. ప్రతీ ఒక్కరూ ఇద్దరినీ ఎంపిక చేయాలని.. క్లాస్, ట్రాష్, మాస్ గ్రూపులుగా విభజించాలని సూచించారు.
‘క్లాస్’ వచ్చిన వారు కెప్టెన్సీ రేసులోకి డైరెక్టుగా వెళ్లడంతోపాటు ఈ వారం నామినేషన్ నుంచి మినహాయింపు దక్కుతుందని బిగ్ బాస్ ప్రకటించారు. ఇక ట్రాష్ వచ్చిన వారు డైరెక్టుగా నామినేషన్ లోకి వెళుతారని బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. ఇక మాస్ అంటూ మధ్యరకం వారిని ఎన్నుకోవాలని బిగ్ బాస్ సూచించారు. వీరు ఇటు కెప్టెన్సీలోకి రారు.. నామినేషన్ లోకి వెళ్లకుండా తటస్థంగా ఉంటారు.
దీంతో ఇంటి సభ్యులంతా అత్యధికంగా బాలాదిత్యను ‘క్లాస్’గా మెజార్టీ సభ్యులు ఎంపిక చేశారు. ‘ట్రాష్’గా వెంట్రుకలతో లొల్లి షురూ చేసిన గీతూను మెజార్టీ ఇంటి సభ్యులు నామినేట్ చేశారు. అందరి అభిప్రాయం ప్రకారం.. ఆదిత్య, సూర్య, శ్రీహాన్ క్లాసులోకి వెళ్లి కెప్టెన్సీ రేసులోకి వచ్చారు.
ఇనాయా, గీతు, ఆది లు ట్రాష్ లోకి వెళ్లిపోయారు.వీరు నామినేట్ రేసులోకి వచ్చారు. మిగిలిన వారిని మాస్ గ్రూపుగా పరిగణించారు. ఈ మూడు గ్రూపుల వారు గేమ్ లలో గెలిస్తే అటూ ఇటూ మారుతుంటారు.
ఇక బిగ్ బాస్ సాయంత్రం మరో టాస్క్ ఇచ్చారు కొబ్బరికాయలను చేతిలో పట్టుకొనే కొట్టుకునే టాస్క్ ఇచ్చారు. క్లాస్, మాస్, ట్రాష్ గ్రూపులో మధ్య పోటీపెట్టారు..
ట్రాష్ గ్రూపులోని ఆది, ఇనియా మధ్య తొలి ‘కొబ్బరిబొండాం’ పోటీ పెట్టగా… ఆది గెలుపొందారు. గెలిచిన ఆది ‘క్లాస్’ గ్రూపులోకి మారాడు. అందులోని ‘శ్రీహాన్’ మాస్ లోకి మారిపోయాడు.
మీమీ జీవితంలో జరిగిన అనుభూతులను పంచుకోవాలని బిగ్ బాస్ కోరగా.. తొలుత ఇనయా మాట్లాడింది. ఇనయా సుల్తానా తను జీవితంలో ఎదగడానికి పడ్డ కష్టాలు చెప్పి.. తన చనిపోయిన తండ్రిని తలుచుకొని ఏడ్చేసింది. ఇంటినుంచి పారిపోయి వచ్చానని.. హాస్టల్ లో కూరలేకపోతే నీళ్లు కలుపుకొని తిన్నానని బోరున ఏడ్చింది. తోటి కంటెస్టెంట్లను కూడా గుక్కపెట్టి ఏడ్చేలా చేసింది.. ఇక ఆ తర్వాత రేవంత్ మాట్లాడాడు.
-రేవంత్ కు తండ్రి చిన్నప్పుడే చనిపోయినా ఆ విషయం చెప్పకుండా తల్లి దాచిందని… అమెరికా వెళ్లాడని అబద్ధమాడాలని.. కానీ 6వ తరగతిలో తండ్రి లేడన్న విషయం తెలిసి అప్పటి నుంచి కష్టపడి ఎదిగి పైకి వచ్చానని రేవంత్ వివరించాడు.. దీని వెనక తన తల్లి, ఫ్యామిలీ సపోర్టు ఉందని రేవంత్ తెలిపారు..
-ఇక లేడీ పుష్ప ‘గీతూ’ వీరందరి లైఫ్ జర్నీలు విని ఎమోషనల్ అయి ఇంట్లోకి వెళ్లి ఒంటరిగా కాసేపు ఏడ్చేసింది. అందరి జీవితాల్లోని అనుభవాలు వింటూ కన్నీళ్ల పర్యంతం అయ్యింది. ఇక తల్లి, తండ్రి తనను అర్థం చేసుకోలేదని.. తన మాట తీరును మొదటి నుంచి నమ్ముకొని ముందుకెళితే యూట్యూబ్ లో ఫేమస్ అయ్యానని.. ఇంత పాపులారిటీకి ఫాలోవర్స్ కారణమని చెప్పుకొచ్చింది.
మొత్తంగా తొలి ఎపిసోడ్ లో హైలెట్ అయ్యింది లేడీ పుష్ప ‘గీతూ’. బాత్రూలో వెంట్రుకలు పడ్డాయని లొల్లి చేసింది మొదలు.. తన చిత్తూరు యాసలో తిడుతూ, సెటైర్లు వేస్తూ.. ఏడేస్తూ జనాలకు ఎంటర్ టైన్ పంచేసింది.
https://www.youtube.com/watch?v=Z_gKoGkBwG0
[…] Also Read: Bigg Boss 6 Telugu Review: బిగ్ బాస్ 1వ రోజు రివ్యూ: బాత… […]