MS Dhoni: 2024 ఐపిఎల్ లో చెన్నై కి భారీ ఎదురు దెబ్బ.. టీమ్ నుంచి ధోని ఔట్.. కారణం ఏంటంటే..?

నిజానికి ఒకవేళ ఈ సంవత్సరం ధోని ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టయితే చెన్నై టీం కి మెంటర్ గా ఉంటూనే ఆ టీమ్ కి సరైన కెప్టెన్ ని నిర్ణయించి ధోని నే టీం ని గ్రౌండ్ బయట నుంచి నడిపిస్తూ ఉంటాడు.

Written By: Gopi, Updated On : January 11, 2024 9:23 am

MS Dhoni

Follow us on

MS Dhoni: 2024 ఐపిఎల్ టైటిల్ గెలవడానికి ప్రతి టీమ్ కూడా కసరత్తులను చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను సంపాదంచుకోవడానికి ప్రతి టీమ్ ఆరాటపడుతుంది…ఇక ఇది ఇలా ఉంటే గత సంవత్సరం టైటిల్ ను గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కి ఈసారి భారీ ఎదురుదెబ్బ తగల నుందని తెలుస్తుంది.

అదేంటంటే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కెప్టెన్ అయిన ధోని ఈ సీజన్ నుంచే ఐపిఎల్ కి రిటైర్ మెంట్ ఇవ్వనున్నాడు అనే న్యూస్ అయితే వైరల్ అవుతుంది. దానికి కారణం ఏంటి అంటే ధోని కి ఉన్న ఏజ్ ని బట్టి ఆయన బాడీ క్రికెట్ ఆడటానికి సహరించడం లేదు అని ఆయన తన ఫిట్నెస్ ని పూర్తి గా కోల్పోయాడంటు తన పర్సనల్ వైద్యులు తెలియజేయడంతో ధోని ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు గా వార్తలైతే వస్తున్నాయి.

నిజానికి ఒకవేళ ఈ సంవత్సరం ధోని ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టయితే చెన్నై టీం కి మెంటర్ గా ఉంటూనే ఆ టీమ్ కి సరైన కెప్టెన్ ని నిర్ణయించి ధోని నే టీం ని గ్రౌండ్ బయట నుంచి నడిపిస్తూ ఉంటాడు. అయితే ధోని అభిమానులకు మాత్రం ఇది చేదు వార్త అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ధోని ఈ ఒక్క సీజన్ లో అడుతాడు ఇదే తనకి లాస్ట్ సీజన్ అవుతుంది. ఇక ఈ ఒక్క సీజన్ లో ధోని బ్యాటింగ్ చూద్దామని అనుకుంటున్నా ప్రతి ఒక్క ధోని అభిమానికి ఇది చాలా బాధను కలిగించే విషయం…అయితే ధోని రిటైర్ మెంట్ మీద ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ మాత్రం భారీగా వైరల్ అవుతుంది. అయితే చెన్నై యాజమాన్యం కూడా దీని మీద పెద్దగా స్పందించడం లేదు.

ఇవి రూమర్ల లేక నిజమైన వార్తల అనే విషయాలు తెలియాలంటే చెన్నై యాజమాన్యం గాని, ధోని గాని ఈ విషయం మీద స్పందించాల్సి ఉంది. ఇక ఇది ఇలా ఉంటే ధోని అభిమానులు మాత్రం ధోని కి ఫిట్నెస్ సరిగ్గా లేకపోయిన జస్ట్ కెప్టెన్ గా తను గ్రౌండ్ లో ఉంటే చాలు అదే టీమ్ కి కొండంత దైర్యం అంటూ విపరీతమైన కామెంట్లను చేస్తున్నారు. నిజానికి ధోని ఫిట్నెస్ ని నిరూపించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా చెన్నై యాజమాన్యం ఎలాగూ ధోని ని పక్కన పెట్టే సాహసం చేయలేదు. ఆడటం ఆడకపోవడం ధోని ఇష్టం…

ఆడాలనుకుంటే ఆడతాడు వద్దు అనుకుంటే తనే డ్రాప్ అయిపోతాడు. కాబట్టి ధోని ఈ సీజన్ కి ఎలాగైనా సరే ఆడి తన అభిమానులని ఆనందింపజేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగాకూడా తెలుస్తుంది. అయితే గ్రౌండ్ బయటి నుంచి టీం ని సపోర్ట్ చేస్తాడా లేదా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకొని టీం లోనే ఉండి ప్లేయర్లందరిని ఒక్కతాటిపై నడిపిస్తాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి.