Biden to host PM Modi : 15 సంవత్సరాల తర్వాత భారత ప్రధానికి అమెరికా అధికార స్వాగతం

మోడీని గతంలో సీఎంగా ఉండగా అమెరికా రాకుండా నిషేధించింది అమెరికా ప్రభుత్వం. ఇదే మోడీకి వ్యతిరేకంగా అమెరికా విష ప్రచారం చేయించింది. ఇప్పుడు అదే అమెరికా ప్రభుత్వం మోడీని అధ్యక్ష భవనంలోకి తీసుకెళ్లబోతోంది.

Written By: NARESH, Updated On : May 12, 2023 11:14 pm
Follow us on

Biden to host PM Modi :  ప్రధాని మోడీ అమెరికా అధ్యక్ష భవనంలోకి అధికార లాంఛనాలతో రాచమర్యాదలు అందుకోబోతున్నారు. ఇది మోడీ ప్రతిష్ట కాదు.. భారతదేశానికి ఇదో గౌరవం. ఇప్పటికీ ఇద్దరికే ఈ అవకాశం దొరికింది. ఒకటి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యూయేల్ మాక్రెన్.. రెండోది దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సోక్ వేర్.. మూడో వ్యక్తిగా భారత ప్రధాని మోడీ.. ఇది దీని ప్రాధాన్యత..

అయితే మోడీ ఎన్నో సార్లు అమెరికా వెళ్లాడు. ఒబామా టైంలో..డొనాల్డ్ ట్రంప్ టైంలో.. బైడెన్ టైంలోనూ అమెరికా వైట్ హౌస్ లోకి వెళ్లి మీటింగ్ లో మోడీ పాల్గొన్నాడు. అఫీషియల్ స్టేటస్ తోటి అమెరికా ప్రభుత్వం ఆహ్వానించడం అన్నది చాలా అరుదుగా లభిస్తుంది. జోబైడెన్ ఇన్నేళ్లలో కేవలం ఇద్దరికే ఆ అవకాశం దక్కింది. మూడో వ్యక్తి మోడీ. అదీ 15 సంవత్సరాల తర్వాత.. ఇది జరగబోతోంది.

2009లో బరాక్ ఒబామా అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ను అఫీషియల్ చీఫ్ గెస్ట్ గా పిలిచారు. తిరిగి ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత భారత ప్రధాని మోడీని స్వాగత సత్కారాలతో జూన్ 22వ తేదీన ప్రవేశం జరుగబోతోంది.

మే 19 నుంచి 21 వరకూ జపాన్, మే 24న జీ7లో మోడీని ప్రత్యేకంగా జోబైడెన్ ఆహ్వానించారు. అయితే ఇవి కేవలం మీటింగ్ లు మాత్రమే. కానీ అమెరికా అఫీషియల్ గా పిలవడం ఇదే తొలిసారి..

ఇదే మోడీని గతంలో సీఎంగా ఉండగా అమెరికా రాకుండా నిషేధించింది అమెరికా ప్రభుత్వం. ఇదే మోడీకి వ్యతిరేకంగా అమెరికా విష ప్రచారం చేయించింది. ఇప్పుడు అదే అమెరికా ప్రభుత్వం మోడీని అధ్యక్ష భవనంలోకి తీసుకెళ్లబోతోంది. దీనివల్ల భారతదేశానికి గొప్ప గౌరవంగా అభివర్ణించవచ్చు.

15 సంవత్సరాల తర్వాత భారత ప్రధానికి అమెరికా అధికార స్వాగతం లభించడంపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింద వీడియోలో చూడొచ్చు.