Homeఎంటర్టైన్మెంట్Bholaa Official Trailer : భోళా ట్రైలర్ రివ్యూ: కథ పూర్తిగా మార్చారు.. రిజల్ట్ ఏమవుతుందో?

Bholaa Official Trailer : భోళా ట్రైలర్ రివ్యూ: కథ పూర్తిగా మార్చారు.. రిజల్ట్ ఏమవుతుందో?

Bholaa - Official Trailer | Ajay Devgn | Tabu | Bholaa In IMAX 3D

Bholaa Official Trailer : గత ఏడాదే కాదు, ఈ ఏడాది రెండు నెలలూ బాలీ వుడ్ కు మాత్రం కలిసి రాలేదు.. షారుఖ్ ఖాన్ పఠాన్ తప్ప… ఇంతవరకు ఏ ఒక్క సినిమా కూడా చెప్పుకోదగిన స్థాయిలో వసూలు సాధించలేదు.. మినిమం గ్యారెంటీ హీరో అక్షయ్ కుమార్ సైతం చతికిల పడుతున్నాడు. మలయాళం సూపర్ హిట్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ ను సెల్ఫీ పేరుతో రీమేక్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దారుణమైన పరాజయం అక్షయ్ కుమార్ ఖాతాలో పడింది. ఇక దక్షిణాదిలోనే సూపర్ హిట్ సినిమాగా నిలిచిన ఖైదీ సినిమాను అజయ్ దేవగన్ భోళా పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ సినిమాలో అజయ్ దేవగన్ కు జోడిగా అమలా పాల్ నటించింది.. కీలకమైన పోలీస్ పాత్రలో టబు కనిపించింది..

ట్రైలర్ చూస్తే ఒరిజినల్ ఖైదీ సినిమాకు, భోళా సినిమాకు పొంతన కుదరడం లేదు. పైగా లోకేష్ కనగరాజ్ ఖైదీ సినిమాలో కొన్ని పాత్రలను తెరపైన కనిపించనీయలేదు. కానీ ఈ సినిమాలో అలా ఉన్నట్టు కనిపించడం లేదు. మాఫియా బ్యాక్ డ్రాప్ ను భారీగా చూపించారు. ఒరిజినల్ సినిమాలో పాటలు లేవు. కార్తీకి జోడి కూడా లేదు. ఇందులో అజయ్ దేవగన్ కు జోడిగా అమలా పాల్ ఉంది. సినిమాకు కీలకమైన పాప పాత్ర కూడా పెంచారు.. కొన్ని కొన్ని సన్నివేశాల్లో పాప మాట్లాడిన దృశ్యాలు కనిపించాయి.

ఇక ఈ సినిమాలో విలన్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఫైట్లు కూడా భారీ స్థాయిలో కంపోజ్ చేశారు. బైక్ మీద పోరాట సన్నివేశాలు ఒళ్ళు గగురుపొడిచేలా ఉన్నాయి. పైగా హిందీ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని.. మూల కథ మాత్రమే తీసుకొని చాలా మార్పులు చేసినట్టు కనిపిస్తోంది.. మాఫియా బ్యాక్ డ్రాప్ ను పెంచినట్టు కనిపిస్తోంది. పైగా అజయ్ దేవగన్ యాక్షన్ హీరో కావడంతో పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన స్వీయ దర్శకత్వంలో, స్వీయ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కింది..

బాలీవుడ్ సినిమాలకు కలెక్షన్లు తగ్గుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు టికెట్ ధరపై తగ్గింపు ప్రకటించారు. ఒక టికెట్ ఉంటే మరొక టికెట్ ఫ్రీ అని ఆఫర్ ప్రకటించారు.. దీనికి తోడు గత ఏడాది చివరిలో దృశ్యం _2 సినిమా ద్వారా బాలీవుడ్ లో కలెక్షన్లు కొల్లగొట్టిన అజయ్ దేవగన్… ఈసారి కూడా దక్షిణాది సినిమానే ఎంచుకున్నాడు. హిందీ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేశాడు.. దక్షిణాది సినిమాలు రీమేక్ చేసినప్పటికీ బాలీవుడ్ లో అడ్డంగా తన్నేస్తున్నాయి.. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version