Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak Movie Review: రివ్యూ : 'భీమ్లా నాయక్' హిట్టా...

Bheemla Nayak Movie Review: రివ్యూ : ‘భీమ్లా నాయక్’ హిట్టా ? ఫట్టా ?

Bheemla Nayak Movie Review:  పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, సంయుక్త మీనన్ తదితరులు.

దర్శకత్వం: సాగర్‌ కె చంద్ర

మాటలు, స్క్రీన్ ప్లే : త్రివిక్రమ్ శ్రీనివాస్

నిర్మాత: ఎస్. రాధాకృష్ణ

సంగీతం: ఎస్.ఎస్. తమన్

సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్

Bheemla Nayak Movie Review
Bheemla Nayak Movie Review

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ సినిమా ‘భీమ్లా నాయక్’ ఒకరోజు ముందుగానే యూఎస్ లో రిలీజ్ అయ్యింది. మరి, ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం

Also Read:   ‘భీమ్లా నాయక్’ తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే !

కథ :

సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా భీమ్లా నాయక్ కి (పవన్ కళ్యాణ్) మంచి పేరు ఉంటుంది. డ్యూటీ కరెక్ట్ గా చేసే భీమ్లా నాయక్ కి ఎక్స్ ఎంపీ కొడుకు డేనియర్‌ శేఖర్‌ ( రానా దగ్గుబాటి)అహంకారంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరుకుతాడు. ఈ క్రమంలో భీమ్లా నాయక్ అతన్ని అరెస్ట్ చేసి లాకప్ లో పెడతాడు. దాంతో డేనియర్‌ శేఖర్‌, భీమ్లా నాయక్ పై పగ తీర్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భీమ్లా నాయక్ జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. మరి అహంకారం ఉన్న డేనియర్‌ శేఖర్‌ కి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న భీమ్లా నాయక్ కి మధ్య ఈగో ఏ స్థాయిలో క్లాష్ అవుతుంది. ఒకరి పై ఒకరు పై చేయి సాధించడానికి ఎంత దూరం వెళ్తారు ? ఈ మధ్యలో సుగుణ (నిత్యా మీనన్) పాత్ర ఏమిటి ? చివరకు డేనియర్‌ శేఖర్‌ – భీమ్లా నాయక్ ఎలా కలిశారు ? దానికి కారణమైన వ్యక్తి ఎవరు ? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :

సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే.. పవర్ స్టార్ పవన్ కల్యాణే ఈ సినిమాకి బిగ్గెస్ట్ హైలైట్. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా అబ్బురపరిచాడు. ముఖ్యంగా ఎమోషనల్ గా సాగే సన్నివేశంలో పవన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అన్యాయాన్ని ఎదిరించే పోలీస్ గా పవన్ నట విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. అహంకారానికి పర్యాయపదంలా ‘రానా’ పాత్ర నిలిచింది. ఆ పాత్రలో రానా తన నటనతో ఒదిగిపోయారు. రానా నటన కూడా తార‌స్థాయిలో ఉంది. రానా – పవన్ మధ్య ఎమోషన్ కూడా చాలా బాగా పడింది.

Bheemla Nayak Movie Review
Pawan Kalyan and Rana Daggubati in Bheemla Nayak

ప‌వ‌న్ భార్యగా నిత్య మేనన్‌ కూడా ఆక‌ట్టుకుంది. దర్శకుడు సాగర్‌ కె చంద్ర కంటెంట్ బేస్డ్ స్టోరీలో హీరోయిజమ్ పెట్టిన విధానం, అలాగే పవన్ ను చూపించే విధానం చాలా బాగున్నాయి. సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. థమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటర్ సినిమాలోని సాగతీత సీన్స్ ను తగ్గించి ఉంటే ప్లస్ అయ్యేది. నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు.

LIVE: Bheemla Nayak Movie Public Response || Bheemla Nayak Movie Review || Pawan Kalyan

ప్లస్ పాయింట్స్ :

పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్సీ

రానా నటన.

డైలాగ్స్,

ఎమోషనల్ సీన్స్,

యాక్షన్ సీన్స్.

మైనస్ పాయింట్స్ :

స్లో నేరేషన్

స్లోగా సాగే యాక్షన్ సీన్స్

సినిమాటిక్ వ్యూ ఎక్కువ అయిపోవడం.

సినిమా చూడాలా ? వద్దా ?

యాక్షన్, ఎమోషన్స్ మిక్స్ చేసి ఓ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ గా వచ్చిన ‘భీమ్లా నాయక్’ ఆకట్టుకుంది. పవన్ – రానా ఇద్దరు తమ యాక్టింగ్ తో బాగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పవన్ అద్భుతంగా నటించాడు. అయితే స్లో నేరేషన్, ప్లే ఒకింత నిరాశపరిచే అంశాలు. మొత్తంగా పవన్ మాత్రం మెప్పించాడు.

రేటింగ్ : 2.75 / 5

Also Read: కేజీఎఫ్ 2’లో మరో బాలీవుడ్ హీరోయిన్ ?

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

5 COMMENTS

  1. […] Hamsa Nandini: ‘సినీ పరిశ్రమలో ఎవరు ఫేట్ ఎలా రాసి ఉందో ఎవ్వరూ చెప్పలేరు’ అని సినీ జనాలు రెగ్యులర్ గా చెప్పుకునే మాట. గత కొన్ని నెలలుగా బ్రెస్ట్ క్యాన్సర్‌తో పోరాడుతున్న టాలీవుడ్ నటి హంసనందిని తన తాజా ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇప్పటివరకు 16 దశల కీమోథెరపీ విజయవంతంగా పూర్తయ్యిందని తెలిపింది. […]

  2. […] Bheemla Nayak Donetions: ఈ రోజు రిలీజ్ అయినా భీమ్లానాయక్ సినిమాకు స్పెషల్ షోలు, అధిక ధరలు వసూలు చేయడానికి వీల్లేదని AP ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గుంటూరు(D) మాచర్లలో పవన్ ఫ్యాన్స్.. నాగార్జున కళామందిర్ థియేటర్ వద్ద ఒక హుండీని ఏర్పాటు చేశారు. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఉద్దేశంతో.. హుండీ ద్వారా వచ్చే విరాళాలు వారికి అందించాలని నిర్ణయించారు. […]

  3. […] Jagan Sarkar Big shock to Bheemla Nayak:  సినిమాకు రాజ‌కీయాల‌కు సంబంధం ల‌దేన్న‌ది పాత‌కాలం ముచ్చ‌ట‌. ఇప్పుడు ఏపీలో ప‌వ‌న్ క‌ల్యాన్ న‌టించిన భీమ్లా నాయ‌క్ వ‌ర్సెస్ జ‌గ‌న్ స‌ర్కార్ అన్న‌ట్టు రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. మొద‌టి నుంచి ఈ సినిమా మీద జ‌గ‌న్ ప్ర‌భుత్వం చాలా ఆంక్ష‌లు విధిస్తూనే ఉంది. టికెట్ల రేట్లు కూడా మూవీ రిలీజ్ అయ్యేదాకా పెంచొద్ద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ కావాల‌నే చేస్తోంద‌ని అంటున్నారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌. ఇక పాత ప‌ద్ధ‌తిలోనే మూవీ రిలీజ్ అయింది. […]

Comments are closed.

Exit mobile version