Bhagavanth kesari teaser : బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. ఈ సినిమా టైటిల్ ని ఇటీవలే ఖరారు చేశారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ టీజర్ ను బాలకృష్ణ జన్మదిన సందర్భంగా శనివారం రిలీజ్ చేశారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన లుక్స్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేశారు. తాజాగా రిలీజైన టీజర్ ను చూసి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆగలేకపోతున్నారు. ఈ టీజర్ ఊర మాస్ లెవెల్ లో ఉండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
సన్ షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ నటిస్తున్నారు. శ్రీ లీల ప్రత్యేక పాత్రలో పోషిస్తున్నారు. అలాగే విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పోషిస్తున్నాడు.
ఇక టీజర్ లో బాలకృష్ణ తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ ఊర మాస్ లెవెల్ లో ఉన్నాయి. ఇటీవల చాలా సినిమాల్లో తెలంగాణ స్లాగ్ ఎక్కువ అయింది. ఇప్పుడు బాలయ్య సినిమాలోని అదే ఉండడం ఆసక్తిగా మారింది. బాలకృష్ణ డైలాగ్స్ తోడుగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.థమన్ అందించిన ఈ మ్యూజిక్ థియేటర్ లో దద్దరిల్లి అవకాశం ఉంది.
