https://oktelugu.com/

తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే..?

దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ధనవంతులపై పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం పెద్దగా పడకపోయినా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు మాత్రం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుడు రోడ్డుపైకి వాహనం తీసుకురావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లపై దృష్టి పెడుతున్నారు. Also Read: అక్కడ ఒక కప్పు టీ 1,000 రూపాయలు.. ఎందుకంత ఖరీదంటే..? మంచి మైలేజ్ ఇచ్చే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 2, 2021 / 12:43 PM IST
    Follow us on

    దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ధనవంతులపై పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం పెద్దగా పడకపోయినా సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు మాత్రం పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సామాన్యుడు రోడ్డుపైకి వాహనం తీసుకురావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లపై దృష్టి పెడుతున్నారు.

    Also Read: అక్కడ ఒక కప్పు టీ 1,000 రూపాయలు.. ఎందుకంత ఖరీదంటే..?

    మంచి మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లలో మారుతీ సుజుకీ డిజైర్ ముందువరసలో ఉంటుంది. ఈ కారు ఎక్స్ షోరూం ధర 5.94 లక్షల రూపాయల నుంచి 8.90 లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది. ఈ కారు లీటర్ కు 23.16 నుంచి 24.12 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ లీటర్ పెట్రోల్ కు 23.20 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ ధర 5.73 లక్షల రూపాయల నుంచి 8.41 లక్షల రూపాయల మధ్యలో ఉంటుంది.

    Also Read: కోటి మందికి ఫ్రీగా గ్యాస్ కనెక్షన్.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

    భారత్ లో తక్కువ ఖర్చుతో మెరుగైన ఇంజిన్ సామర్థ్యంలో అందుబాటులో ఉన్న కారు డాట్సన్ రెడీ గో. ఈ కారు ప్రారంభ వేరియంట్ ధర రూ.2.71 లక్షలు కాగా హై ఎండ్ వేరియంట్ ధర రూ.4.37 లక్షలుగా ఉంది. ఈ కారు లీటర్ పెట్రోల్ కు 22 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. మన దేశంలో ఎక్కువ ఆదరణ కలిగిన కార్లలో ఒకటైన కార్లలో ఆల్టో ఒకటి. ఈ కారు లీటర్ కు 22.05 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఈ కారు ప్రారంభ ధర రూ.2.99 లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర రూ.4.48 లక్షలుగా ఉంది. రెనో క్విడ్, మారుతీ సుజుకీ వేగనార్, మారుతీ సుజుకీ ఎక్స్ ప్రెసో, హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్, మారుతీ సుజుకీ సెలెరియో, హోండా అమేజ్ కార్లు మెరుగైన మైలేజ్ ను ఇవ్వడంతో పాటు తక్కువ ధరకే మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.