https://oktelugu.com/

వెండితెర‌పై ‘ఆట’ షురూ.. మోత మోగ‌నున్న థియేట‌ర్లు!

మైదానాల్లో ఆట సాధారణ విషయమే. కానీ.. వెండి తెరపై మాత్రం అరుదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడో.. ఒకటీ అరా చిత్రాలు వచ్చిపోతుంటాయి. కానీ, ఇప్పుడు ఒక‌టీరెండు కాదు.. ఏకంగా అర‌డ‌జ‌నుకు పైగా చిత్రాలు క్రీడానేప‌థ్యంలో తెర‌కెక్కుతున్నాయి. ఈ నెల నుంచే ఆట మొద‌లు కాబోతోంది. స్పోర్ట్స్ కు ఫ్యామిలీ, ప్రేమ అంశాల‌ను జోడించి, వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. మ‌రి, ఆ సినిమాలు ఏంటీ..? ఏయే ఆట‌ల‌తో రూపొందుతున్నాయి? ఎప్పుడు రాబోతున్నాయి? అనేది చూద్దాం. Also Read: […]

Written By:
  • Rocky
  • , Updated On : March 2, 2021 / 12:30 PM IST
    Follow us on


    మైదానాల్లో ఆట సాధారణ విషయమే. కానీ.. వెండి తెరపై మాత్రం అరుదు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడో.. ఒకటీ అరా చిత్రాలు వచ్చిపోతుంటాయి. కానీ, ఇప్పుడు ఒక‌టీరెండు కాదు.. ఏకంగా అర‌డ‌జ‌నుకు పైగా చిత్రాలు క్రీడానేప‌థ్యంలో తెర‌కెక్కుతున్నాయి. ఈ నెల నుంచే ఆట మొద‌లు కాబోతోంది. స్పోర్ట్స్ కు ఫ్యామిలీ, ప్రేమ అంశాల‌ను జోడించి, వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. మ‌రి, ఆ సినిమాలు ఏంటీ..? ఏయే ఆట‌ల‌తో రూపొందుతున్నాయి? ఎప్పుడు రాబోతున్నాయి? అనేది చూద్దాం.

    Also Read: నో లవ్ స్టోరీ.. యంగ్ హీరో సంచలన నిర్ణయం

    ల‌క్ష్య : నాగశౌర్య హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో.. ఒక కీలక పాత్రలో విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నారు. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో.. ఈ సినిమా రాబోతోంది. క్రీడా నేపథ్యానికి ఫ్యామిలీ డ్రామాను యాడ్ చేశారు. జగపతి బాబు ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

    ‘ఎ1 ఎక్స్‌ప్రెస్’ : సందీప్‌కిషన్ ఈ హీరో గా హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన తొలి తెలుగు చిత్రమిది. డైరెక్ట‌ర్ డెన్నిస్ జీవ‌న్ రూపొందించారు. లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఫ‌స్ట్ లుక్ తోనే ఆడియ‌న్స్ ను ఆక‌ర్షించిన ఈ మూవీ.. త్వ‌ర‌లో రిలీజ్ కు సిద్ధ‌మ‌వుతోంది. దేశంలో రాజ‌కీయాలు క్రీడాకారుల జీవితాల‌ను కూడా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయ‌నేకాన్సెప్ట్ తో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఈ చిత్రాన్ని సందీప్ కిష‌న్ స్వ‌యంగా నిర్మించాడు. హిప్హాప్ తమీజా సంగీతం అందించారు. తమిళ చిత్రం ‘నాప్టే తునై’ రీమేక్ అయిన‌ప్ప‌టికీ.. 50 శాతం మార్పులు చేశారు. ఈ ఒరిజినల్ ను సైత‌ డెన్నిస్ జీవన్ తెర‌కెక్కించ‌డం విశేషం. మార్చి 5న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

    గుడ్ ల‌క్ స‌ఖి : ‘మ‌హాన‌టి’ కీర్తి సురేష్ న‌టిస్తున్న లేరీ ఓరియంటెడ్ మూవీ ఇది. నష్ట జాతకురాలిగా ముద్రపడిన ఓ యువతి.. అన్ని అడ్డంకులను అధిగమించి రైఫిల్ షూటర్ గా ఎలా విజయం సాధించిందనే ఇతివృత్తంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. నగేష్ కుకునూర్ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పాడిరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 3న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

    గని : వరుణ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. పూర్తిగా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు బాక్సింగ్ నేప‌థ్యంలో చాలా చిత్రాలు వ‌చ్చాయి. అయితే.. ప్రొఫెష‌న‌ల్ బాక్స‌ర్ ఎలా ఉంటాడో వ‌రుణ్ చూపించ‌బోతున్నాడు. ఈ సినిమాలో వ‌రుణ్ స‌ర‌స‌న స‌యీ మంజ్రేక‌ర్ న‌టిస్తోంది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్న వ‌రుణ్‌.. ఈ చిత్రం ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

    Also Read: ల‌వ‌ర్ ఫొటో షేర్ చేసిన శ్రీముఖి.. క్ర‌ష్ మొత్తం అత‌నిపైనే అంట‌!

    లైగ‌ర్ : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబోలో వ‌స్తున్న క్రేజీ మూవీ ‘లైగర్’. ఈ చిత్రం కూడా క్రీడా నేప‌థ్యంలోనే రాబోతోంది. మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ ప‌వ‌ర్ చూపించ‌బోతున్నాడు విజ‌య్‌. ‘సాలా క్రాస్ బ్రీడ్‌’ అంటూ వ‌చ్చిన ఫ‌స్ట్ లుక్ ఆడియ‌న్స్ ను ఫుల్లుగా అట్రాక్ట్ చేసింది. దీంతో.. ఈ చిత్రంపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. సుమారు 120 కోట్ల భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను సెప్టెంబర్ 9న రిలీజ్ చేయ‌బోతున్నారు.

    సీటీ మార్ : ద‌ర్శ‌కుడు సంపత్ నంది – గోపీచంద్ కాంబోలో రాబోతున్న మూవీ సీటీ మార్. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. స్పోర్ట్స్ బేస్డ్ మూవీకి కమర్షియల్ అంశాలు జోడించి తెర‌కెక్కించారు. మహిళల కబడ్డీ జట్టు కోచ్‌‌‌‌లుగా గోపీచంద్, తమన్నా కనిపించనున్నారు. ‘క‌‌‌‌బ‌‌‌‌డ్డీ.. మైదానంలో ఆడితే ఆట‌‌‌‌.. బ‌‌‌‌య‌‌‌‌ట ఆడితే వేట’ అంటూ రాబోతున్న ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ నమోదు చేస్తుందోననే ఆసక్తి నెలకొంది. ఏప్రిల్‌‌‌‌ 2న ఈ సినిమా విడుదల కానుంది.

    ఇవేకాకుండా.. ఇంకా పుల్లెల గోపీచంద్ బ‌యోపిక్ కూడా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో సుధీర్ బాబు నటిస్తున్నాడు. సుధీర్ బాబు కూడా ఒకప్పటి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కావడం విశేషం. అదేవింగా.. బాలీవుడ్‌లో ‘83’ సినిమా రూపొందుతోంది. కపిల్ దేవ్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు.. అజయ్ దేవ్ గన్ ప్రధాన పాత్రలో ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో ‘మైదాన్’ రూపొందుతోంది. ఈ విధంగా సినిమాలన్నీ వెండి తెరపై ఆట మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. మరి, ఎన్ని సినిమాలు టైటిల్ ఎగరేసుకుపోతాయో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్