Homeజాతీయ వార్తలుBeer Sales In Telangana: తాగుబోతుల తెలంగాణ.. దేశంలోనే టాప్.. ఒక్క నెలలోనే తెలంగాణ సరికొత్త...

Beer Sales In Telangana: తాగుబోతుల తెలంగాణ.. దేశంలోనే టాప్.. ఒక్క నెలలోనే తెలంగాణ సరికొత్త రికార్డు!

Beer Sales In Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి మద్యం అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఏటేటా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతోంది. అమ్మకాల్లో ఏటా రికార్డులు బద్దలవుతున్నాయి. ఇక వేసవి నేపథ్యంలో తాజాగా మరో రికార్డు నమోదైంది. గతేఏడాది తెలంగాణలో మద్యం విక్రయాలు ఆల్‌ టైం రికార్డు నమోదు చేశాయి. ఏకంగా రూ.34 వేల కోట్లకుపైగా మద్యాన్ని తాగేశారు. మద్యం తాగేవారు పెరుగుతుండడం, ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటం, అనేక బ్రాండ్ల మద్యం దొరక్కపోవడంతో తెలంగాణ నుంచి చాలామంది అక్రమంగా తీసుకెళుతున్నారు. దీని వల్ల తెలంగాణలో మద్యం విక్రయాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో మద్యం కిక్కు అసలు తగ్గడం లేదు. ప్రతీ ఏడాది కిక్కు మరింతగా పెరుగుతూనే ఉంది. నానాటికి మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా ఆదాయం పెరుగుతూనే ఉంది. 2022 జనవరి 1 నుంచి డిసెంబర్‌ 31 వరకు తెలంగాణవ్యాప్తంగా మొత్తం రూ.34,352.75 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది. 2021లో మొత్తం రూ.18,868 కోట్ల అమ్మకాలు జరిగితే.. 2020లో మొత్తం కలిపి రూ.16,254 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2020, 2021 కంటే గత ఏడాదిలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. .

ఒక్క మే నెలలో 3,285 కోట్ల తాగేశారు..
తెలంగాణలో మే నెలలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. ఏకంగా ఖజానాకు రూ.3,285 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక మే 31వ తేదీ ఒక్కరోజే 300 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ అధికారికంగా ప్రకటించింది.

పెరిగిన బీర్ల అమ్మకాలు..
ఎండలు మండిపోతుండడంతో బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఏప్రిల్‌లో వర్షాలు కురువడంతో బీర్ల అమ్మకాలు గతేదికంటే తగ్గాయి. మేలో భానుడు భగ్గుమనడంతో మందుబాబులో బీర్లను నీళ్లలా తాగేశారు. ఈ నెలలో అత్యధికంగా 64,48,469 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. 30,66,167 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయాలు జరిగినట్లు తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ వెల్లడించింది. మే 31న ఒక్కరోజే 2,55,526 లక్షల కేసుల బీర్లు, 3,31,961 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయాలు జరిగినట్లు తెలిపింది.

గత రికార్డు బద్దలు..
2022, మే నెలలో 55,72,000 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరుగగా.. 27,11,000 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయాలు జరిగాయి. ఈసారి 64,48,469 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. 30,66,167 లక్షల కేసుల లిక్కర్‌ విక్రయాలు.

తెలంగాణ నుంచి ఏపీకి..
ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా ఉండటం, అన్ని బ్రాండ్ల మద్యం దొరక్కపోవడంతో అక్రమంగా మద్యం సరఫరా జరుగుతోంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారు దొంగచాటుగా అధికారులకు చిక్కకుండా మద్యం తీసుకెళుతున్నారు. తెలంగాణలో మద్యం సేల్స్‌ భారీగా పెరగడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో లిక్కర్‌ సేల్స్‌ రికార్డు బద్దలు కొడుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular