https://oktelugu.com/

మొబైల్ ఫోన్ కు ఫుల్ ఛార్జింగ్ పెట్టవచ్చా..? పెట్టకూడదా..?

దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఫోన్ ను వినియోగించే వాళ్లు ఫోన్ ఛార్జింగ్ విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్లే కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్ పేలిపోవడం జరుగుతుంది. సాధారణంగా మన ఫోన్ యొక్క పర్ఫామెన్స్ ను * 3001#12345#* డయల్ చేసి తెలుసుకోవచ్చు. కొన్ని ఫోన్లలో ఈ నంబర్ ను డయల్ చేసిన తరువాత ఫీల్డ్ మోడల్ డిస్‌ప్లే కనిపించి సెల్ టవర్ల వివరాలు కూడా సులభంగా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 17, 2021 / 10:29 AM IST
    Follow us on

    దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఫోన్ ను వినియోగించే వాళ్లు ఫోన్ ఛార్జింగ్ విషయంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వల్లే కొన్ని సందర్భాల్లో మొబైల్ ఫోన్ పేలిపోవడం జరుగుతుంది. సాధారణంగా మన ఫోన్ యొక్క పర్ఫామెన్స్ ను * 3001#12345#* డయల్ చేసి తెలుసుకోవచ్చు. కొన్ని ఫోన్లలో ఈ నంబర్ ను డయల్ చేసిన తరువాత ఫీల్డ్ మోడల్ డిస్‌ప్లే కనిపించి సెల్ టవర్ల వివరాలు కూడా సులభంగా తెలుస్తాయి.

    Also Read: క్రెడిట్ కార్డులు వాడేవాళ్లకు బ్యాంకులు భారీ షాక్..?

    సాధారణంగా స్మార్ట్ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ స్పాన్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే అలవాట్లపై, బ్యాటరీ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది. బ్యాటరీలు ఫుల్ ఛార్జింగ్ అయిన తరువాత కూడా ఛార్జ్ చేస్తే బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్ ను ఫుల్ ఛార్జింగ్ అయిన తరువాత కూడా అలానే ఉంచితే బ్యాటరీ పనితీరుపై ప్రభావం పడుతుందని టెక్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

    Also Read: తప్పుగా బదిలీ చేసిన నగదును రివర్స్ లో ఎలా పొందాలంటే..?

    శాంసంగ్ సహా ఇతర మొబైల్ మేకర్లు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. రాత్రి సమయంలో గంటల తరబడి ఛార్జింగ్ కనెక్ట్ చేసి ఫోన్ ను వదిలేయకూడదని.. ఫోన్ బ్యాటరీ లెవెల్ 30 శాతం నుంచి 70 శాతం మధ్య దగ్గరగా ఉండేలా చూసుకోవాలని కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఫోన్ బ్యాటరీ 100 శాతానికి ఛార్జ్ కావాలంటే ఎక్కువ ఎనర్జీ అవసరం పడుతుందని.. ఇలా చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    ఆండ్రాయిడ్ ఫోన్లలో బ్యాటరీ లైఫ్ కోసం accubattery అనే యాప్ ఉంటుందని.. జీరో శాతానికి ఛార్జింగ్ పడిపోయేంత వరకు మొబైల్ ఫోన్ ను వాడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ ను ఎల్లప్పుడూ చల్లని ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలని.. వేడి, ఉష్ణోగ్రత ఉంటే బ్యాటరీ లైఫ్ పై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.