Homeజాతీయ వార్తలుBBC Documentary On PM Modi: మోదీపై విద్వేషపూరిత డాక్యుమెంటరీ. సొంత దేశంలో తీవ్ర నిరసనను...

BBC Documentary On PM Modi: మోదీపై విద్వేషపూరిత డాక్యుమెంటరీ. సొంత దేశంలో తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్న బిబిసి.

BBC Documentary On PM Modi: బ్రిటిష్ బ్రాడ్ కాస్ట్ కార్పొరేషన్… స్థూలంగా బీబీసీ… దీని పని వార్తలు ప్రసారం చేయడం… ఎప్పుడో 1921లో ప్రారంభమైన ఈ సంస్థ… వార్తల ప్రసారం కంటే… తేనె తుట్టెలను కదపడం మీదే ఆసక్తి ఎక్కువ. ఒక బ్రిటిష్ తప్ప మిగతా అన్ని దేశాల్లో ఉన్న వివాదాస్పద అంశాలను గెలుక్కోవడం ఈ సంస్థకు వెన్నతో పెట్టిన విద్య.. అందుకే కొన్ని ఇస్లామిక్ దేశాలు దీనిని నిషేధించాయి.. అయినా కూడా దాని ధోరణి మారలేదు. మారదు కూడా.. ఇక భారత్ విషయంలో బీబీసీ ఎప్పుడూ విషం చిమ్ముతూనే ఉంటుంది. కోవిడ్ సమయంలో ఈ సంస్థ ఎంతటి భయానకమైన వార్తలు ప్రసారం చేసిందో ప్రపంచం మొత్తానికి తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలు ఎటువంటి చర్యలు తీసుకోరు.. తాజాగా ఈ సంస్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై టన్నుల కొద్దీ విషం కక్కింది. దీంతో బీబీసీ పై నిరసన వ్యక్తం అవుతున్నది.

BBC Documentary On PM Modi
BBC Documentary On PM Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ సిరీస్ ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీలో ఎటువంటి విశ్వసనీయత లేదు.. బ్రిటన్ లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీలో వలసవాదం మనస్తత్వం, ఆలోచన ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మోడీపై ఈ డాక్యుమెంటరీని బీబీసీ రెండు భాగాలుగా ప్రచారం చేసింది. 2002 లో గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అల్లర్ల సమయంలో ఆ రాష్ట్రానికి మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.. దీంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతున్నది. కొన్ని ప్లాట్ ఫామ్ ల నుంచి దీనిని తొలగించారు కూడా. భారతీయ మూలాలు ఉన్న బ్రిటన్ పౌరులు ఈ డాక్యుమెంటరీని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రముఖ బ్రిటన్ పౌరుడు లార్డ్ రమీ రేంజర్ బీబీసీ తీరు పై తీవ్ర నిరసన వ్యక్తం చేశాడు. డాక్యుమెంటరీ 100 కోట్ల ప్రజల మనోభావాలను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ సోయి బిబిసి కి లేదా?

గుజరాత్ అల్లర్ల గురించి ప్రస్తావించే బీబీసీ… దానికి కారణమైన వ్యక్తుల గురించి కూడా కథనాలు ప్రసారం చేస్తే బాగుండేది..ఇదే లెక్కన బిబిసి పుట్టిన బ్రిటన్ దేశంలో జాత్యాంహకార ధోరణి ఎలా ఉంటుందో ప్రపంచానికి తెలుసు.. దానిపై కూడా పలు భాగాలుగా డాక్యుమెంటరీలు తీస్తే ఆ వలసవాద దేశ దుర్నీతి ప్రపంచానికి తెలిసేది.. 200 ఏళ్ల పాటు భారత్ ను పాలించి, విలువైన వనరులు దోచుకుపోయింది గాక…ఇవాళ మోడీ పై, భారత్ పై విషం కక్కడం ఆ బీబీసీ కే చెల్లింది. ప్రపంచానికి ఘనమైన వారసత్వం ఇచ్చామని చెప్పే బ్రిటన్.. పాలించే సత్తా లేక తన దేశాన్ని ఓ భారత పౌరుడి చేతిలో పెట్టింది. దీనిపై కూడా బీబీసీ డాక్యుమెంటరీ తీస్తే బాగుండేది.

BBC Documentary On PM Modi
BBC Documentary On PM Modi

ఇక డాక్యుమెంటరీని బ్రిటన్ మాజీ సెక్రెటరీ జాక్ స్ట్రా అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించింది.. వాస్తవానికి ఒక డాక్యుమెంటరీ తీయాలి అంటే ఎంతో లోతుగా పరిశీలన, పరిశోధన చేయాల్సి ఉంటుంది. కానీ వాటి అన్నింటికీ మంగళం పాడుతూ బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేయడం నిజంగా నెత్తి మాసిన తనం. ఇక ఇదే డాక్యుమెంటరీలో ఇంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ అనే పదాలను వాడారు..మరీ వీటిని దేనికి వాడారు? ఇందులో ప్రాతిపదిక ఏమిటి? ఈ ప్రశ్నల కు బీబీసీ సమాధానాలు చెప్పలేదు. దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ డాక్యుమెంటరీ కి ఎంత విశ్వసనీయత ఉందో?!

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version