కేంద్రం శుభవార్త.. కారును తుక్కు చేస్తే కొత్త‌కారుపై డిస్కౌంట్‌..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో స్క్రాపేజ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్క్రాపేజ్ పాలసీ ప్రకారం 20 సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కు చేయాల్సిందే. పాత వాహనాల వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పాత వాహనాలకు షాక్ ఇచ్చేలా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. Also Read: ఏపీలోని ఆ గ్రామంలో […]

Written By: Navya, Updated On : February 8, 2021 11:18 am
Follow us on

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 1వ తేదీన బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సమయంలో స్క్రాపేజ్ పాలసీని ప్రకటించిన సంగతి తెలిసిందే. స్క్రాపేజ్ పాలసీ ప్రకారం 20 సంవత్సరాలు దాటిన వాహనాలను తుక్కు చేయాల్సిందే. పాత వాహనాల వల్ల కాలుష్యం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో పాత వాహనాలకు షాక్ ఇచ్చేలా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది.

Also Read: ఏపీలోని ఆ గ్రామంలో వింత మేకపిల్ల.. అచ్చం కోడిలా..?

8 సంవత్సరాలు దాటిన వాణిజ్య వాహనాలు, 15 సంవత్సరాలు దాటిన వ్యక్తిగత వాహనాలకు కేంద్రం గ్రీన్ ట్యాక్స్ విధించనుంది. అయితే చాలామంది వాహనదారులు పాతకారును తుక్కు చేయడానికి ఇష్టపడటం లేదు. అయితే పాతకారును తుక్కు చేసిన వారికి కేంద్రం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పాత కారును తుక్కు చేసిన వారికి అదనపు ప్రయోజనాలు చేకూరేలా చేసింది.

Also Read: రైతులకు మరో శుభవార్త చెప్పిన మోదీ సర్కార్.. ఏంటంటే..?

కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పాత కారును తుక్కు చేస్తే కొత్త కారుపై అదనపు ప్రయోజనాలను కల్పిస్తామని తెలిపారు. త్వరలో స్క్రాపేజ్ పాలసీకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆటో మొబైల్ ఇండ‌స్ట్రీకి స్క్రాపేజ్ పాలసీ బూస్ట్ లా పని చేస్తుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. 10 లక్షల కోట్ల రూపాయలకు ఇండస్ట్రీ టర్నోవర్ పెరుగుతుందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శి గిరిధ‌ర్ అర‌మానె పాత వాహనాలను తుక్కు చేసిన వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు. దేశంలో పాత వాహనాల కోసం ఫిట్ నెస్ టెస్టుల కేంద్రాలను, తుక్కు కేంద్రాల‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు కీలక ప్రకటన చేశారు.