Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సమయం దగ్గర పడుతోంది. జనవరి 22న అయోధ్య ఆలయానికి ప్రాణప్రతిష్ట జరుగనుంది. ఈ వేడుక కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. రామాలయ నిర్మాణం కేవలం మతపరమైన, సాంస్కృతిక పరమైన అంశాలే కాదు. కొన్ని రంగాల అభివృద్ధికి ఊతం ఇస్తోంది. ఇప్పటికే అయోధ్యలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. అంతేకాదు.. రామాలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో స్టాక్ మార్కెట్ కూడా సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా కొన్ని స్టాక్స్ పాజిటివ్ ట్రెండ్‌లో సాగుతున్నాయి.
ఇండియన్ రైల్వే..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ స్టాక్స్ గత నెలలో 20 శాతం పెరిగాయి. శ్రీరాముడి ఆలయ ప్రతిష్టాపన ఉత్సవం కారణంగా భక్తులు పెద్దసంఖ్యలో అయోధ్యకు రానున్నారు. ఈ నేపథ్యంలో టూరిజం ప్యాకేజీ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ఐఆర్సీటీసీ షేర్ ధర పెరిగింది. జనవరి 12న ఈ షేర్ ధర రూ.950కి పెరిగింది.
అపోలో సింధూరి హోటల్..
చెన్నైకి చెందిన అపోలో హాస్పిటాలిటీ కంపెనీ షేరు ధర జనవరి 12 నాటికి రూ.2,560కి చేరింది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్ ధర 90 శాతం కన్నా ఎక్కువగా పెరిగింది. ఇయన్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన సుమారు 100 శాతం వృద్ధి నమోదు చేసింది. అపోలో సింధూరి హోటల్స్ అయోధ్యలోని మల్టీ–లెవల్ పార్కింగ్, బిగ్ రూఫ్‌టాప్ రెస్టారెంట్‌ను డెవలప్ చేస్తోంది. దాని మార్కెట్ విలువను మెరుగుపరుస్తోంది.
ప్రవేగ్ లిమిటెడ్
ఈవెంట్ అండ్ ఎగ్జిబిషన్ మేనేజ్మెంట్లో ప్రత్యేకత కలిగిన ఈ స్మార్ట్ క్యాప్ కంపెనీ స్టాక్ ప్రైజ్ గత నెలలో 70 శాతం పెరిగింది. ప్రవేగ్ లిమిటెడ్ అయోధ్యలో రెండు డేరా నగరాలను ఏర్పాటు చేసింది. ఒకటి రామజన్మభూమి సమీపంలో, మరొకటి సరయూ నది ఒడ్డున ఏర్పాటు చేసింది. ఒక రాత్రికి రూ.8 వేల నుంచి ప్రారంభమయ్యే ఈ విలాసవంతమైన వసతి గృహాల బుకింగ్ గతేడాది నవంబర్‌లో మొదలయ్యాయి. అంతేకాకుండా కంపెనీ ఇటీవల లక్ష్యద్వీప్‌లో రిసార్ట్ నిర్మించడానికి ముందకు వచ్చింది. దీంతో కూడా స్టాక్ విలువ భారీగా పెరిగింది. జనవరి 12 నాటికి ప్రవేగ్ లిమిటెడ్ షేర్ ధర రూ.1,135.90గా ఉంది.
జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్..
జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మ్యాపింగ్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ. అయోధ్య నగరం అధికారిక మ్యాప్‌ను చార్ట్ చేయడానికి అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ తన న్యూ ఇండియా మ్యాప్ ప్లాట్ఫారంను ఎంపిక చేసినట్లు కంపెనీ వెల్లడించింది. తమ మ్యాపింగ్ ప్లాట్‌ఫాం ప్రజలకు కచ్చితమైన రూట్లు, లొకేషన్ వివరాలు అందించడమే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాల కోసం రూపొందిచిన ప్రత్యేక ఫ్యూచర్‌ను కూడా ఉంటుందని తెలిపింది. గడిచిన నెలలో జెనెసిస్ స్టాక్ ధర 16 శాతం పెరిగింది. జనవరి 12న దీని ధర రూ.507.80గా నమోదైంది.
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్
ఇటీవల కేంద్రం ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభించింది. దేశంలోనే అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో ఒకటైన ఇడిగో జనవరి 6న ఢిల్లీ నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. ముంబై నుంచి జనవరి 11న విమానం ప్రారంభించింది. అహ్మదాబాద్ నుంచి జనవరి 15న సర్వీసులు మొదలు పెట్టనుంది. దీంతో ఇండియా పెరెంట్ కంపెనీ అయిన ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్ ధర గతనెలలో 4 శాతం పెరిగింది. జనవరి 12 నటికి దీని ధర రూ.3,066.35గా నమోదైంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ayodhya ram temple boost to the stock market stocks of five companies have increased hugely
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com