Avatar The Way Of Water Movie Review: నటీనటులు: సామ్ వార్తింగ్టన్, జో సల్దానా, స్టెఫాన్ ల్యాంగ్, జోయల్ డేవిడ్ మోర్, దిలీప్ రావు తదితరులు
రచన/నిర్మాత/దర్శకత్వం: జేమ్స్ కామెరాన్
మ్యూజిక్ డైరెక్టర్ : జేమ్స్ హార్నర్
సినిమాటోగ్రాఫర్: మారో ఫియోర్
ఎడిటర్స్: స్టెఫాన్ రివ్కిన్, జాన్ రెఫూవా, జేమ్స్ కామెరాన్
బ్యానర్: లైట్ స్ట్రామ్ ఎంటర్‌టైన్‌మెంట్, డ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్
డిస్ట్రిబ్యూటర్: 20th సెంచరీ స్టూడియోస్

ప్రపంచం లోని సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూసిన చిత్రం అవతార్ 2 చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా 186 భాషల్లో కనీవినీ ఎరుగని రేంజ్ లో విడుదల అయ్యింది..సుమారు 12 ఏళ్ళ పాటు జేమ్స్ కెమరూన్ ఒక యజ్ఞం లాగా భావించి ఈ సినిమాని తెరకెక్కించాడు..2009 లో విడుదలైన అవతార్ సినిమానే అద్భుతమైన థియేట్రికల్ అనుభవం కలిగించింది..ఆరోజుల్లోనే ఇలాంటి టెక్నాలజీ తో ఇంత గ్రాండియర్ గా ఎలా తీసాడని అందరూ ఆశ్చర్యపోయారు..మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు..ప్రపంచవ్యాప్తంగా ఆరోజుల్లోనే ఈ సినిమాకి 3 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు వచ్చాయి..ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రం నేడు 3D , 4DX , ఐమాక్స్ 3D ఫార్మాట్ లో విడుదలైంది..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూద్దాము.
కథ :
పండోర గ్రహం లోకి అడుగుపెట్టిన జేక్ సుల్లీ నేత్రి ని పెళ్లి చేసుకొని ఒక కుటుంబం ని ఏర్పర్చుకుంటాడు..అక్కడ వీళ్ళు ఎంతో సంతోషం గా జీవనం గడుపుతుంటారు..పండోర గ్రహం లో ఉన్న ప్రకృతి ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ,నేత్రి కి తనకి తెలిసిన విద్యలన్నీ నేర్పిస్తాడు జేక్ సుల్లీ..ఆ క్రమం లో భూమి నుండి మనుషులు పండోర గ్రహం లో ఉన్న అమూల్యమైన వనరులను ఆక్రమించుకోవడానికి వస్తారు..వాళ్ళతో జేక్ సుల్లీ మరియు నేత్రి యుద్ధం చేస్తారు..అతు భీకరంగా జరిగే ఈ యుద్ధం లో జేక్ సుల్లీ మానవుల నుండి పండోర గ్రహాన్ని కాపాడుతాడా..లేదా మానవులకు లొంగిపోతాడా అనేది మిగిలిన స్టోరీ.
విశ్లేషణ :
టెక్నికల్ గా అవతార్ చిత్రం ఒక అద్భుతం అయితే..అవతార్ 2 అందుకు పది రెట్లు థియేట్రికల్ అనుభవం ని రప్పించింది అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..ముఖ్యంగా 3D వెర్షన్ లో చూసిన ప్రతీ ఒక్కరికి ఒక సరికొత్త లోకం లోకి మనం అడుగుపెట్టామా అనే అద్భుతమైన అనుభూతిని కలిగించేలా చేసింది ఈ చిత్రం..అమెరికన్ సైన్యానికి చెందిన జేక్ సుల్లీ మరియు ఏలియన్ నేత్రి కి మధ్య జరిగిన లవ్ స్టోరీ ని ఎంతో సృజనాత్మకంగా, మనసుకి హత్తుకునేలా, చక్కటి ఎమోషన్స్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు జేమ్స్ కెమరూన్..మొదటి పార్ట్ విజువల్ వండర్ గా నిలిస్తే, రెండవ పార్ట్ మాత్రం ఎమోషన్స్ తో నిండిపోయిన విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు జేమ్స్ కెమరూన్..యుద్ధం మరియు శాంతి నేపథ్యం లో జేమ్స్ కెమరూన్ ఈ సినిమాని నడిపించిన తీరు అమోఘం..ఇక తెలుగు వెర్షన్ ని ప్రముఖ నటుడు/రచయితా/ దర్శకుడు అవసరాల శ్రీనివాస్ మాటలు అందించిన సంగతి మన అందరికి తెలిసిందే.
తెలుగు నేటివిటీ కి బాగా దగ్గరయ్యే విధంగా ఆయన రాసిన డైలాగ్స్ కి బాగున్నాయి..ఇక ఈ సినిమా గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ..మారో ఫియారే కెమెరా పనితనం ని మెచ్చుకోవడానికి మన పదాజాలం సరిపోదు..కెమెరా తో ఎటువంటి అద్భుతాలు చెయ్యొచో ఆయన ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించాడు..ఇక జేమ్స్ హానర్ అందించిన మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా, మనకి సరికొత్త అనుభూతిని కలిగించేలా ఉంటుంది..ఈ సినిమా కోసం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంతలా ఎదురు చూడడానికి కారణం విజువల్ ఎఫెక్ట్స్..మేస్ట్రో జో లెట్టేరి అందించిన విజువల్ ఎఫెక్ట్స్ ని అవార్డ్స్ కి అతీతం..నేవిలా రూపురేఖల కోసం ఉపయోగించిన నీలి రంగు మనకి మంచి ఫీల్ గుడ్ మూవీ ని చూసాము అనే అనుభూతిని కూడా ఇస్తుంది.

చివరి మాట: అవతార్ 2 ఒక విజువల్ వండర్..ఇలాంటి సినిమాలను థియేటర్ లో చూస్తే వచ్చే అనుభూతి టీవీ లలో వచ్చేది కాదు..ఒక మూడు గంటలపాటు మన కష్టాలన్నీ మర్చిపోయి ఒక సరికొత్త లోకం లోకి అడుగుపెట్టి అక్కడ ప్రయాణించిన అనుభూతిని ఈ సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడికి ఇస్తుంది..ముఖ్యంగా ఈ వెండితెర అద్భుతాన్ని 3D లో చూడడం మాత్రం మిస్ అవ్వొద్దు..3D లో కనీవినీ ఎరుగని రేంజ్ అనుభూతిని ఇస్తుంది ఈ చిత్రం..మీరు టికెట్ కోసం పెట్టిన ప్రతి పైసా కి సంతృప్తి పరిచే చిత్రం ఇది.
రేటింగ్ : 3.25 /5