Partha Chatterjee, Arpita Mukherjee : ముసలోడే కానీ.. మహానుభావుడు’ అని ఇప్పుడు బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏలడానికి మంచిగా మంత్రి పదవి. చేయడానికి రాష్ట్రంలో సరిపడా స్కాంలు.. ఇక ఎంజాయ్ చేయడానికి ‘అర్పిత ముఖర్జీ’ లాంటి ఓ అందగత్తె.. ఇంకేం.. ఈ ముసలి జీవితానికి ఇంతకంటే ఏం కావాలని ప్రశాంతంగా సాగుతున్న పార్థఛటర్జీ జీవితంలో అనుకోని మలుపు. కేంద్రంలోని ఈడీ కన్నెర్ర చేయడంతో మన మంత్రిగారి బాగోతం అంతా బయటపడిపోయింది. ఆయన కొల్లగొట్టిన డబ్బు.. అర్పిత ముఖర్జీతో యవ్వారంతోపాటు ఆమె ఇంట్లో దొరికిన సెక్స్ టాయ్స్ గురించే ఇప్పుడు అంతా చర్చ సాగుతోంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఇప్పుడు ‘ఎస్ఎస్.సీ’ స్కామ్ షేక్ చేస్తోంది. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నది సీఎం మమతా బెనర్జీ కేబినెట్ లోని కీలక మంత్రి ‘పార్థ ఛటర్జీ. ఈయన చేసిన వ్యవహారాలన్నీ వెలుగుచూడడంతో దెబ్బకు మంత్రి పదవి నుంచి మమత తీసివేశారు. ప్రస్తుతం ఈయనపై ఈడీ దాడులు జరుతున్నాయి. ఈడీ దాడుల్లో మంత్రి పార్థ ఛటర్జీకి అత్యంత సన్నిహితురాలైన గర్ల్ ఫ్రెండ్ అర్పిత ముఖర్జీ ఇంట్లో ఎస్ఎస్.సీ స్కాంలో కాజేసిన దాదాపు రూ.50 కోట్ల రూపాయల అక్రమార్జన వెలుగుచూసింది.ఇంట్లో ఎక్కడ చూసినా రూ.500, రూ.2000 నోట్లు కుప్పలుగా దొరకడం సంచలనమైంది. ప్రస్తుతం ఈ కుంభకోణం పశ్చిమ బెంగాల్ రాజకీయాలను షేక్ చేస్తోంది. సీఎం మమతపై బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

బెంగాల్ స్కూల్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో ఈడీ పార్థఛటర్జీ సన్నిహితుల ఇళ్లపై దాడి చేసింది. పార్థఛటర్జీకి సన్నిహితురాలిగా ఉన్న అర్పితా ముఖర్జీ ఇంట్లో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఇందులో ఈడీ అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా ఏకంగా రూ.50 కోట్ల నగదుతోపాటు కిలోల కొద్దీ బంగారం బయటపడింది. మొత్తం రూ.2వేలు, రూ.500 నోట్ల కట్టలు కట్టలుగా కనిపించాయి. వీటిని లెక్కించడానికి ఏకంగా కౌంటింగ్ మెషీన్లు, బ్యాంకు ఉద్యోగులను ఈడీ ఆశ్రయించాల్సి వచ్చింది. ఓ పెద్ద ట్రక్కులో డబ్బును ఈడీ తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక అర్పిత ఫ్లాట్ లో ఓ వెండి గిన్నెను స్వాధీనం చేసుకున్నారు. బెంగాల్ లో కొత్తగా పెళ్లయిన జంటకు ఇలాంటి వెండిగిన్నెలు ఇచ్చే సంప్రదాయం ఉంది. దీంతో మంత్రి పార్థఛటర్జీకి అర్పితకు ఏంటి సంబంధం అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
తాజాగా ఈరోజు మంత్రి పార్థ ఛటర్జీకి సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ ఇంట్లో మరో వస్తువులు చూసి ఈడీ అధికారులు షాక్ తిన్నారు. అర్పితా ముఖర్జీ ఫ్లాట్ నుంచి ‘సెక్స్ టాయ్స్’ దొరకడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై కూడా అర్పితను ఈడీ ప్రశ్నిస్తోంది. సెక్స్ టాయ్స్ ను ఎవరు ఇచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? ఎవరు ఉపయోగించారన్న విషయాన్ని ఈడీ అధికారులు ఆరాతీస్తున్నారు.
సెక్స్ టాయ్స్ ద్వారా పార్థ ఛటర్జీ-అర్పితా ముఖర్జీ మధ్య రహస్య సంబంధం బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరి వ్యవహారం ఇప్పుడు బెంగాల్ రాజకీయాలను షేక్ చేస్తోంది. మమత కేబినెట్ లోని కీలకమైన వాణిజ్యపన్నులు, ఐటీ శాఖలు చూసే పార్థ ఛటర్జీ ఇలాంటి వ్యవహారాలు చూడడంతో మమతా బెనర్జీకి మింగుడుపడడం లేదు. పైగా తృణమూల్ కాంగ్రెస్ కు ఈ పార్థ ఛటర్జీ ప్రధాన కార్యదర్శి కూడా. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు బెంగాల్ రాజకీయాలను ఊపు ఊపేస్తోంది. మమతా బెనర్జీ సర్కార్ ను షేక్ చేస్తోంది.