Devara: ఎన్టీయార్ దేవర సినిమాని భారీ రేటు కి కొనుగోలు చేసిన నెట్ ఫ్లిక్స్…

ఈ సినిమా డైరెక్టర్ అయిన కొరటాల శివ ఈ సినిమాలో ప్రతి సీన్ ని చాలా కేర్ తీసుకొని మరి షూట్ చేస్తునట్టు గా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన యాక్షన్ పార్ట్ ని చిత్రీకరిస్తున్నట్టు గా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : September 30, 2023 1:11 pm

Devara

Follow us on

Devara: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా గుర్తింపు పొందిన వాళ్లలో యంగ్ టైగర్ ఎన్టీయార్ ఒకరు. ఈయన సాధించిన హిట్ సినిమాలు కనక చూసుకున్నటైతే ఆది, సింహాద్రి, యమదొంగ, బృందావనం, అదుర్స్ లాంటి హిట్స్ తో ఈయన ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా ఎదిగారు. ఇక ఇప్పుడు టెంపర్ మూవీ నుంచి వరుసగా ఆరు హిట్లు కొట్టి మరో బ్లాక్ బస్టర్ హిట్ కోసం దేవర సినిమా తో మన ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా డైరెక్టర్ అయిన కొరటాల శివ ఈ సినిమాలో ప్రతి సీన్ ని చాలా కేర్ తీసుకొని మరి షూట్ చేస్తునట్టు గా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన యాక్షన్ పార్ట్ ని చిత్రీకరిస్తున్నట్టు గా తెలుస్తుంది.ఈ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం వాటర్ లో ఉంటుందని కూడా తెలుస్తుంది.ఇక ఈ స్టంట్స్ మొత్తం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తో చీత్రికరించడం జరిగుంటుంది అని చిత్ర ుని ట్ చెప్పడం జరిగింది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఎన్టీయార్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది.దాంతో ఈ సినిమా మీద ఎన్టీయార్ ఫ్యాన్స్ లోనే కాదు నార్మల్ జనాల్లో కూడా విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి.

ఇక కొరటాల శివ కి ఇది డూ ఆర్ డై సినిమా అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే కొరటాల శివ చిరంజీవి తో చేసిన ఆచార్య సినిమా డిజాస్టర్ అవ్వడం తో ఆయన పేరు బాగా డ్యామేజ్ అయింది అప్పటి వరకు ఉన్న ఆయన ఇమేజ్ అంత పోవడం తో మళ్లీ ఫ్రెష్ గా ఈ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.అందుకే ఈ సినిమా విజయ వంతం అవ్వడం చాలా ముఖ్యం…ఇక ఈ సినిమా కి సంభందించిన ఓటిటి రైట్స్ కోసం భారీ పోటీ ని ఎదురుకొని నెట్ ఫ్లిక్స్ సంస్థ 90 కోట్లకి ఈ సినిమా రైట్స్ ని దక్కించుకోవడం జరిగింది.నిజానికి ఇది చాలా హ్యుజ్ అమౌంట్ అనే చెప్పాలి.ఇక దీంతో ఇప్పటికే దేవర సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్నఅంచనాలు ఈ వార్త తెలిసిన తర్వాత తార స్థాయి కి చేరుకున్నాయి…

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తో ఎన్టీయార్ పాన్ ఇండియా హీరో గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా తో ఆ పేరు ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నట్టు గా తెలుస్తుంది.ఈ సినిమా కూడా హిట్ అయితే వరుసగా 7 హిట్లు కొట్టిన హీరో గా ఎన్టీయార్ హిస్టరీ క్రియేట్ చేస్తాడు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరో ల్లో ఎవ్వరు కూడా వరుసగా ఏడూ హిట్లు కొట్టలేదు…కాబట్టి ఎన్టీయార్ పేరు మీద ఒక సరికొత్త రికార్డు అనేది నమోదు అవుతుంది.ఇక ఇది హిట్ అయితే మళ్లీ కొరటాల ఈజ్ బ్యాక్ అవుతాడు కాబట్టి ఈ హిట్ కోసం అటు హీరో, ఇటు డైరెక్టర్ ఇద్దరు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా లో హీరోయిన్ గా జాహ్నవి కపూర్ నటిస్తుంది.అలాగే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు…