BBC documentary on Modi : బీబీసీ డాక్యుమెంటరీ చిలికి చిలికి గాలి వాన అవుతోంది. దీన్ని ప్రతిపక్షాలు కెలికి మరీ అంశంలా వివాదంలో సృష్టిస్తున్నారు. అసలు బీబీసీ డాక్యుమెంటరీని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే బాగుండేది. బ్లాక్ చేయడం వివాదాస్పదమైంది. ఇది ప్రతిపక్షాలకు బంగారు అవకాశంగా మార్చింది. దేశం మొత్తం అల్లర్లు సృష్టించే కుట్రను ప్రతిపక్షాలు పన్నుతున్నాయి.
బీబీసీ డాక్యుమెంటరీని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని చూశాయి. కానీ ఇది వికటించింది. 2002లో జరిగిన ఘటనలో ఎన్నో వ్యాసాలు, లైవ్ వీడియోలు, ఎన్నో డాక్యుమెంటరీలు వచ్చాయి. అన్నింట్లోనూ మోడీపై వ్యతిరేకతతో మారుమోగింది. మరి తర్వాత 2011లో క్లారిటీ.. 2022లో సుప్రీంకోర్టు మోడీకి క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు నిర్ధోశి అన్నాక కూడా దోషి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
బీబీసీ డాక్యుమెంటరీలో కొత్తగా రివీల్ చేసిన అంశం ఏదైనా ఉందా? అన్నది మనం ఆలోచించాలి. మోడీ సీఎంగా ఉన్న సమయంలో బ్రిటన్ ప్రభుత్వం ఒక రిపోర్ట్ ను తమ హైకమిషనర్ ను అడిగారని.. ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు బీబీసీకి వచ్చి డాక్యుమెంటరీ చేసింది.
బీబీసీ డాక్యుమెంటరీ వల్ల దేశంలో అల్లర్లకు ప్రతిపక్షాలు కుట్ర పన్నాయా? అన్న దానిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..
