https://oktelugu.com/

Dangerous Apps : మన ఫొటోలు దొంగిలిస్తున్న యాప్‌.. వెంటనే ఈ 12 యాప్‌లు డిలీట్‌ చేయండి!

ఈ యాప్‌లలో 1,00,000 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లు మూడు ఉన్నాయి. ఈ యాప్‌లను తక్షణమే ఫోన్‌ నుంచి తొలగించాలని కంపెనీ స్ట్రిక్ట్‌గా చెప్పింది.

Written By:
  • NARESH
  • , Updated On : January 1, 2024 8:39 pm
    Follow us on

    Dangerous Apps : సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్ది.. మనం ఉపయోగించే ఫోన్లు కూడా అప్డేట్‌ అవుతున్నాయి. అనేక ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక ఫోన్‌లో వివిధ అవసరాల కోసం యాప్‌లను కూడా డౌన్‌లోడ్‌ చేసుకుంటున్నాం. అయితే ఇలాంటి యాప్‌లు మన అవసరం తీరాక ఫోన్‌లోనే ఉంటున్నాయి. మనం వాడకపోయినా డేటా చోరీ చేస్తున్నాయి. అందుకే మన డేటా త్వరగా అయిపోతుంది. ఇక కొన్ని యాప్స్‌ మన ఫొటోలను ఎత్తుకెళ్తున్నాయి. మనకు తెలియకుండానే వేరేవారికి షేర్‌ చేస్తున్నాయి. దీంతో డీప్‌పేస్‌కు అవకాశం కలుగుతుంది. కొంతమంది రహస్య, వ్యక్తిగత ఫొటోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. అయితే మనకు తెలియకుండానే ఫొటోలు వాళ్ల చేతిలోకి వెళ్లిన విషయం తెలియడం లేదు. ఈమేరకు కేంద్రం హెచ్చనిస్తున్నా.. మనం జాగ్రత్త పడడం లేదు. ఇటీవల డీఫ్‌ఫేస్‌ వచ్చాక.. వీడియోలను కూడా మార్ఫిగ్‌ చేస్తున్నారు. ప్రముఖుల వీడియోలు మార్ఫింగ్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో మన ఫొటోలు చోరీ చేస్తున్న యాప్‌ల గురించి తెలుసుకుందాం.

    వివిధ ప్రయోజనాల కోసం..
    మనం వివిధ ప్రయోజనాల కోసం అనేక యాప్‌లు ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేస్తాం. కానీ కొన్నిసార్లు కొన్ని యాప్‌లు మనకు చాలా ప్రమాదకరమని ఇటీల తెలిసింది. తాజాగా మరో భయానక విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. గూగుల్‌లో ప్లే స్టోర్‌లో 12 యాప్‌లు మన ఫోన్‌లోని ఫొటోలు, ఇతర డేటాను తస్కరిస్తున్నట్లు గుర్తించారు. ఎంసీఏఎఫ్‌ఈఈ వంటి కొన్ని యాప్‌ల జాబితాను గూగుల్‌ విడుదల చేసింది, వీటిని ’గ్చీఝ్చ జీఛిజీౌuట’ అని పిలుస్తారు. కంపెనీ ప్రకారం..మాల్వేర్‌–సోకిన యాప్‌లు ఫోన్‌లకు యాక్సెస్‌ పొందడానికి ‘సోషల్‌ ఇంజినీరింగ్‌’ని ఉపయోగిస్తాయి. డివైజ్‌ యొక్క వినియోగదారులు వారికి తెలియకుండానే కమాండ్‌–అండ్‌–కంట్రోల్‌ సర్వర్‌లతో కమ్యూనికేట్‌ చేయడానికి అనుమతి ఇస్తుంంది. ఇంతలో, మోసగాడు ఫోన్‌లో మరొక పేలోడ్‌ను డౌన్‌లోడ్‌ చేస్తాడు.. ఫోన్‌పై పూర్తి నియంత్రణను తీసుకుంటాడు. అప్పుడు అతను ప్రకటనపై క్లిక్‌ చేసి, వినియోగదారు అనుమతి లేకుండా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తాడు. ఈ యాప్‌ లు దాదాపు 3,27,000 డివైజ్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు నివేదికలో చెప్పబడింది. ఈ యాప్‌లలో 1,00,000 మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌లు మూడు ఉన్నాయి. ఈ యాప్‌లను తక్షణమే ఫోన్‌ నుంచి తొలగించాలని కంపెనీ స్ట్రిక్ట్‌గా చెప్పింది.

    జాబితాలో ఉన్న 12 యాప్‌లు ఇవే..

    Essential Horoscope for Android

    3D Skin Editor for PE Minecraft

    Logo Maker Pro

    Count Easy Calorie Calculator

    Sound Volume Extender

    LetterLink

    Numerology: Personal horoscope & number predictions

    Step Keeper: Easy Pedometer

    Track Your Sleep

    Numerology: Personal horoscope & number predictions

    Astrological Navigator: Daily Horoscope & Tarot

    Universal Calculator.