AP income: అవసరాన్ని బట్టి మారుతున్న ఏపీ ‘ఆదాయం’?

AP Income: ఏపీలో ప్రభుత్వ ఆదాయంపై గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) ఏపీ ఆదాయంపై ఒక రిపోర్ట్ ఇస్తే.. ఏపీ సర్కారు మాత్రం మరో నివేదిక ఇస్తుండటం విడ్డూరంగా మారింది. దీంతో జగన్ సర్కార్ అవసరాన్ని బట్టి ఆదాయాన్ని పెంచడం, తగ్గించడం వంటివి చేసి చూపెడుతూ ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను మోసం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధప్రదేశ్ ఆదాయంపై ‘కాగ్’ ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీనిప్రకారం గత రెండేళ్లలో ఏపీ ఆదాయం 39శాతం […]

Written By: NARESH, Updated On : January 20, 2022 10:55 am
Follow us on

AP Income: ఏపీలో ప్రభుత్వ ఆదాయంపై గందగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్(కాగ్) ఏపీ ఆదాయంపై ఒక రిపోర్ట్ ఇస్తే.. ఏపీ సర్కారు మాత్రం మరో నివేదిక ఇస్తుండటం విడ్డూరంగా మారింది. దీంతో జగన్ సర్కార్ అవసరాన్ని బట్టి ఆదాయాన్ని పెంచడం, తగ్గించడం వంటివి చేసి చూపెడుతూ ప్రభుత్వ ఉద్యోగులను, ప్రజలను మోసం చేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Andhra Pradesh

ఆంధప్రదేశ్ ఆదాయంపై ‘కాగ్’ ఇటీవల ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీనిప్రకారం గత రెండేళ్లలో ఏపీ ఆదాయం 39శాతం పెరిగిందని స్పష్టమవుతోంది. ఈ ఏడాది నంబర్ వరకు ప్రభుత్వానికి వచ్చిన రాబడి రూ.88వేల618 కోట్లు అని కాగ్ తేల్చిపారేసింది. కానీ ఏపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా లెక్కలు చెబుతుండటం విడ్డూరంగా మారింది.

Also Read: అవసరాన్ని బట్టి మారుతున్న ఏపీ ‘ఆదాయం’?

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఏపీ ఆదాయం భారీగా పడిపోయిన్లు ఏపీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆదాయం కేవలం 62 వేల కోట్లు మాత్రమేనని ఏపీ సీఎస్ సమీర్ శర్మ చెబుతున్నారు. కరోనా లేకుంటే 98వేల కోట్ల ఆదాయం వచ్చేదని ఆయన అంచనా వేశారు. అయితే కాగ్ చెబుతున్న లెక్కలకు సీఎస్ చెబుతున్న లెక్కలకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు.

ప్రభుత్వం తాము చేస్తున్న పనులను సమర్ధించుకోవడానికే ఇలాంటి తప్పుడు లెక్కలను చూపిస్తుందనే వాదనలు విన్పిస్తున్నాయి. తమకు అవసరమైన సమాచారాన్ని మాత్రం ప్రభుత్వం వెల్లడిస్తుందని మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.

కేంద్ర పన్నుల్లో ఏపీ సర్కారుకు వచ్చే వాటా, గ్రాంట్స్ తిరిగి చెల్లించేవి కావు. అవన్నీ ప్రజల పన్నుల రూపంలో కట్టేవే. వీటిని ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండా కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని మాత్రమే చూపెడుతోందని తెలుస్తోంది. ఈ లెక్కలతో జగన్ సర్కారు ఉద్యోగులను మభ్య పెడుతున్నట్లు కన్పిస్తోంది. దీంతో ఉద్యోగులకు లెక్కలు రావా? అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి.

మరోవైపు ప్రభుత్వం ఆదాయ మార్గాలను మూసేసుకొని.. కేవలం పన్నుల మాత్రమే పెంచుకుంటూ పోతే ఆదాయం పెరగదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారుకు ఎంత ఆదాయం వస్తుందనేది పక్కన పెడితే ఏపీ సీఎస్ సమీర్ శర్మ చెబుతున్న లెక్కల్లో మాత్రం వాస్తవం లేదని కాగ్ నివేదిక బట్టబయలు చేసింది. దీంతో ప్రభుత్వం ఎవరినీ మభ్య పెట్టడానికి ఇలాంటి తప్పుడు లెక్కలను చూపిస్తునేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Also Read: ఏపీలో పీఆర్సీ వివాదం మళ్లీ రాజుకుందెందుకు..? సమస్య ఎక్కడ వచ్చింది..?