CM YS Jagan : ముందస్తు ఎన్నికలకు జగన్ సర్కారు సిద్ధపడుతోంది. ఇదే మంచి శకునంగా భావిస్తోంది. ఇప్పుడు కానీ ఎన్నికలకు వెళ్లకపోతే నష్టమని భావిస్తోంది. చాలారకాల కారణాలు అన్వేషించి జగన్ స్థిర నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. గతంలో చాలాసార్లు ముందస్తు ముచ్చట వచ్చినా అవి పుకార్లే అని తేలిపోయాయి. ఈసారి మాత్రం కచ్చితంగా ముందస్తుకే జగన్ మొగ్గుచూపిస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీకి ఎన్నికలు జరిగితే చాలా ఇబ్బందులు అధిగమించవచ్చని జగన్ శిబిరం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్టుగానే సమాయత్తమవుతోంది.
ప్రధానంగా యాంటీ మోదీ ప్రభావం వచ్చే ఎన్నికల్లో అధికంగా ఉండే చాన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా ఈ రాష్ట్రానికి మోసం చేసిందని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. గ్రౌండ్ లెవల్ లో సైతం వైసీపీ, బీజేపీ ఒక్కటేనన్న భావన ఉంది. ఇది మంరింత పెరుగుతూ వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇది ప్రస్పుటంగా కనిపించే చాన్స్ ఉంది. అదే జరిగితే వైసీపీకి నష్టం తప్పదు. బీజేపీ, వైసీపీ విడివిడిగా పోటీచేసినా ప్రజలు ఒక స్థిరమైన నిర్ణయానికి రావడం కారణంగా యాంటీ మోదీ వేవ్ తో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం కనిపిస్తోంది.
మరోవైపు వచ్చే ఎన్నికల్లోతనతో కలిసి రావాలని బీజేపీని చంద్రబాబు కోరుతూ వస్తున్నారు. కానీ బీజేపీ ససేమిరా అంటోంది. అటు చంద్రబాబుతో కలిసి వెళ్లకపోయినా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి న్యూట్రల్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే వైసీపీకి నష్టమే. ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీపై ఉన్న కోపంతో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కు అవసరమైన వాటి విషయంలో బీజేపీ సహకరించింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. అందుకే సార్వత్రిక ఎన్నికల వరకూ ఆలోచించే కంటే.. ముందస్తుకు వెళితే కొంత సాయం చేస్తుందని జగన్ భావిస్తున్నారు. అటు తెలంగాణ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఏపీ విషయంలో పెద్దగా తలదూర్చే చాన్స్ ఉండదని అంచనా వేస్తోంది.
టీడీపీకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ముందస్తే శరణ్యమని మరో కారణంగా చెబుతున్నారు. నాలుగేళ్ల పాలన పూర్తిచేసుకున్న వైసీపీ సర్కారుపై వ్యతిరేకత ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలలో బాగా కనిపించింది . మొత్తం మూడు ఎమ్మెల్సీ సీట్లూ టీడీపీ ఖాతాల్లో పడిపోయాయి. దాంతో ఇక ఏడాది దాకా కూర్చుని 2024 లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తే మాత్రం పుట్టె పూర్తిగా మునగడం ఖాయమని వైసీపీ భావిస్తొందిట. టీడీపీ, జనసేన మధ్య పొత్తుల వాతావరణం ఉన్నా కన్ఫర్మ్ కాలేదు. అభ్యర్ధుల సెలెక్షన్ కూడా ఇంకా కొలిక్కి రాలేదు. అందుకే డిసెంబర్ లో ఎన్నికలు అంటే అది తమకు బాగా ఉపయోపడుతుందని వైసీపీ భావిస్తోందట. మొత్తానికైతే ముందస్తుకే జగన్ మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 7న జరిగి అత్యవసర కేబినెట్ మీటింగ్ లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.