Posani Jagan: ఏపీలో జగన్ అధికారం చేపట్టడంలో టాలీవుడ్ సినీ ప్రముఖ పాత్ర కూడా ఉంది. నాడు చంద్రబాబును వ్యతిరేకించి స్వయంగా మోహన్ బాబు, అలీ, పోసాని కృష్ణమురళి, జీవితా రాజశేఖర్ లాంటి వారు జగన్ కు భేషరుతుగా మద్దతిచ్చారు.. అంతేకాదు.. జగన్ తరుఫున ఎన్నికల్లోనూ ప్రచారం చేశారు.

ముఖ్యంగా అలీ అయితే గుంటూరు నుంచి అసెంబ్లీ సీటు హామీపై వైసీపీలో చేరారు. నాడు ఎన్నికల సమీకరణాల్లో ఆయనకు సీటు ఇవ్వలేకపోయిన జగన్ రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ కానీ ఇతర కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లకు కానీ పట్టించుకోలేదు. ఎట్టకేలకు అధికారం మరో రెండేళ్లు మాత్రమే ఉన్న వేళ మీడియా సలహాదారుగా రెండేళ్ల కాలానికి అలీకి పదవి ఇచ్చారు.
ఇక ఇప్పుడు పోసాని వంతు వచ్చింది. మరో రెండేళ్లలో ముగియబోయే జగన్ ప్రభుత్వం ఉన్నట్టుండి వైసీపీ తరుఫున బలంగా నిలబడి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబు లాంటి వారిని బలంగా తిట్టిపోసే సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కీలక పదవి ఇచ్చింది.
తాజాగా పోసానికి సీఎం జగన్ పిలిచి మరీ పదవి ఇచ్చారు. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలీ తోపాటు పోసానికి కూడా నార్మల్ పదవులనే జగన్ కేటాయించారు.
పోసాని, అలీకి సడెన్ గా ఏవో మొక్కుబడి పదవులు ఇవ్వడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్పొచ్చు. ఆయన బలంగా ఎదురునిలుస్తూ వైసీపీని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ కోసం పాటుపడ్డ సినీ ప్రముఖులకు జగన్ పదవులు ఇవ్వకుండా ఇన్నాళ్లు నాన్నాడు. కానీ పవన్ బలంగా నిలబడడం.. సినీ ఇండస్ట్రీ ఆయనకే మద్దతుగా ఉండడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సన్నిహితులకు ఈ పదవులు ఇవ్వాల్సి వచ్చింది. పవన్ పై కోపంతోనే అలీ, పోసానిలకు ఈ మొక్కుబడి పదవులు ఇచ్చినట్టు తెలుస్తోంది.